పెళ్ళైనా స్పీడు తగ్గట్లేదుగా..!

samantha akkieneni telugu news telugu post

పెళ్ళైన హీరోయిన్స్ కి అవకాశాలు రావడం చాలా అరుదు. వచ్చినా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందులోనూ ఫ్యామిలీని కన్విన్స్ చేసి సినిమా రంగంలో రాణించాలి అంటే చాలానే గట్స్ ఉండాలి. మరి గ్లామర్ ఫీల్డ్ అంటే అందాల ఆరబోత తప్పని సరి. పెళ్లయ్యాక అలాంటివి ఉండొద్దంటూ అత్తింటి వారి కండీషన్స్ మొదలవుతాయి. కానీ వీటన్నికి అతీతంగా టాప్ హీరోయిన్ సమంత తన పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో పిచ్చెక్కించేస్తోంది. పెళ్లి తర్వాత వరస హిట్స్ అందుకున్న సమంత కి యూ టర్న్ సినిమానే ఆఖరి సినిమా అవుతుంది అనుకున్నారు. కానీ నాగ చైతన్య తో సమంత శివ నిర్వాణ డైరెక్షన్ లో ఒక సినిమాకి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చేతి నిండా సినిమాలు…

అలాగే తమిళంలోనూ రెండు మూడు సినిమాలతో బిజీగా వుంది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సమంత యూ టర్న్ తోనూ హిట్ కొట్టెయ్యాలనే కసితో సినిమా షూటింగ్ పూర్తి చేసింది. అలాగే నాగ చైతన్య తో కలిసి శివ నిర్వాణం సినిమా చేయనున్న సమంత ఇప్పుడు గ్లామర్ రోల్స్ కన్నా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల మీద పడిందంటున్నారు. పెళ్ళికి ముందు నుండే ప్రాధాన్యత గల పాత్రల్లో నటిస్తానని చెబుతున్న సమంత కి స్టార్ హీరోలు అవకాశాలైతే ఇవ్వడం లేదు.. కానీ సమంత మాత్రం ఏదో విధంగా బిజీగానే ఉంది. ప్రస్తుతం సమంత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన గిరిసయ్య చెప్పిన స్టోరీ లైన్ కి బాగా ఇంప్రెస్ అయ్యిందనే టాక్ వినబడుతుంది.

పెళ్లైనా మారని హీరోయిన్…

గిరిసయ్య కథ హీరోయిన్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ అయినప్పటికీ నటన పరంగా ఛాలెంజ్ అనిపించే స్కోప్ అందులో చాలా ఉండటంతో ఎక్కువ ఆలోచన చేయకుండా ఓకే చెప్పేసిందనే టాక్ వినబడుతుంది. మరి పెళ్లయ్యాక గ్లామర్ పరంగా ఏమాత్రం చేంజ్ కానీ సమంత ఇలా కెరీర్ లో పరుగులు పెడుతుంది అంటే.. నిజంగా సమంత గ్రేట్ అనే చెప్పాలి. స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వకపోతేనేమి… ఇక సినిమాలే లేవా అన్నట్టుగా ఉంది సమంత కెరీర్ చూస్తుంటే. అందుకే పెళ్ళైనా స్పీడు తగ్గట్లేదు అనేది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*