‘మిస్ గ్రానీ’ సమంత..?

samantha akkieneni telugu news telugu post

పెళ్లైన తర్వాత హీరోయిన్స్ కు పెద్దగా కలిసిరాదనే మాట సమంతకు నచ్చలేదేమో. అందుకే పెళ్లి తర్వాత వరసగా సూపర్ హిట్ చిత్రాలు చేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న సమంత మరో కన్నడ సూపర్ హిట్ అయిన చిత్రంతో తెలుగులోకి మన ముందుకి వస్తుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యు టర్న్’ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో సమంత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కోరియన్ మూవీ రీమేక్

ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. దీని తర్వాత కూడా సామ్ మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు రెడీ అయినట్లు సమాచారం. ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తున్నారని ఫిలింనగర్ సమాచారం. ఇది ఒక కొరియన్ మూవీ అని తెలుస్తుంది. ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం కొరియాలో రిలీజ్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

70 ఏళ్ల ముసలావిడగా…

ఈ మూవీలో ఒక మహిళ జీవితంలోని వివిధ దశల్ని చూపిస్తారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ 70 ఏళ్ల ముసలావిడ గానూ కనిపించాల్సి ఉంటుంది. అది స్టోరీ లైన్. మరి అందుకు సమంత ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి. కాకపోతే అచ్చు గుద్దినట్టు దాన్ని దింపకుండా మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు అడాప్ట్ చేసుకుని సినిమా తీయనున్నారట. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి హ్యాండిల్ చేయనుంది. గతంలో వీరి కాంబినేషన్ లో ‘జబర్దస్త్’ అనే మూవీ వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నందిని రెడ్డి ‘కళ్యాణ వైభోగమే’ తర్వాత రెండేళ్లకు పైగా ఖాళీగా ఉండి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను డీల్ చేయననుంది. అయితే ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*