యూఎస్ లో సమంత రికార్డు!!

ఆ హీరో రికార్డ్స్ నెలకొల్పాడు..లేదా ఈ హీరో రికార్డ్స్ నెలకొల్పాడు అని ఆలా హీరోస్ గురించే మాట్లాడుకుంటాం. కానీ హీరోయిన్స్ గురించి మాట్లాడుకోము. సినిమాల్లో వాళ్ల వంతు కూడా ఉంటుంది కదా..కానీ రికార్డుల మాటెత్తితే పాపం హీరోయిన్ల ఊసే ఉండదు. అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం ఆ రికార్డ్స్ ని మరిచిపోవడం లేదు. రంగస్థలం సినిమా యూఎస్ లో నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే.

మిలియన్ డాలర్ల క్లబ్ లోకి….

లేటెస్ట్ గా ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరడంతో సమంత ఖాతాలో 13 మిలియన్ డాలర్ల సినిమాలు అంటూ సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసారు. ఈ సినిమా 3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అసలు విషయం ఏంటంటే యూఎస్ లో తొలి మిలియన్ డాలర్ సినిమాగా నిలిచిన ‘దూకుడు’లో సమంతే హీరోయిన్. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ‘దూకుడు’ తర్వాత ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’. ‘సన్నాఫ్ సత్యమూర్తి’; ‘మనం’, ‘24’, ‘తెరి’, ‘బ్రహ్మోత్సవం’, ‘అఆ’, ‘జనతా గ్యారేజ్’, ‘మెర్సల్’, ‘రంగస్థలం’ సినిమాలు మిలియన్ డాలర్ మార్కును దాటాయి అంటూ సామ్ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.

ఏ హీరోయిన్ కూ…..

ఇప్పటివరకు సౌత్ లో ఏ హీరోయిన్ కు ఇటువంటి రికార్డు లేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ రికార్డు మన తెలుగులో ఏ హీరోకి కూడా లేదు. మొన్నటివరకు సమంత నటించిన ‘అఆ’ బిగ్గెస్ట్ హిట్‌గా ఉందక్కడ.ఆ చిత్రం 2.45 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. అయితే ఇప్పుడు ‘అఆ’ సినిమా రికార్డును రంగస్థలం బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఆమెను అంత ‘మిలియన్ డాలర్ బేబీ’ గా కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*