‘మిస్ గ్రానీ’కి ‘నో’ చెప్పిన సామ్…కానీ..!

samanth a rejected role in miss granee

పెళ్లికి ముందు ఏమో కానీ పెళ్లి తరువాత మాత్రం సమంతకి తెగ కలిసి వచ్చేస్తుంది. వరసగా సినిమాల మీద సినిమాలు చేసి సక్సెస్ అవుతుంది. అయితే ఏది పడితే అది ఒప్పుకోకుండా పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ నటిస్తుంది. నటనపరంగా తనకి మరింత పేరు తెచ్చిపెట్టే విభిన్నమైన పాత్రలను చేయడానికి ఉత్సాహాన్ని కనబరుస్తోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా డైరెక్టర్ నందిని రెడ్డి చెప్పిన కథకు ఓకే చెప్పింది. ఇది కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్. ఇందులో సమంత యువతిగానే కాకుండా 70 యేళ్ల బామ్మగానూ కనిపించనుంది. ఆల్రెడీ బామ్మ గెటప్ ఫోటోషూట్స్ కూడా అయిపోయిందని సమాచారం.

అప్పుడే వృద్ధురాలిగా వద్దని

70 యేళ్ల బామ్మగా సామ్ అదిరిపోయిందని టాక్. దీనికి ‘ఓ బేబీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వృద్ధురాలి పాత్రకు సామ్ ‘నో’ చెప్పిందట. అప్పుడే వృద్ధురాలి పాత్రలో కనిపిస్తే ఆ ప్రభావం కెరియర్ పై పడుతుందని తన స్నేహితులు, సన్నిహితులు చెప్పడంతో ‘నో’ చెప్పేసిందట. దీంతో ఆ వృద్ధురాలి పాత్రకి సీనియర్ హీరోయిన్ లక్ష్మిని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. అంటే యువతిగా ఉన్నప్పుడు సామ్… 70 యేళ్ల బామ్మ గా లక్ష్మి నటించనున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలియనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*