సామ్ మనసు వెన్న…… అందుకే…!

సమంత కోలీవుడ్ లోను, టాలీవుడ్ లోను టాప్ హీరోయిన్ రేంజ్ కి దిగడం లేదు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న సమంత సినిమాల్లోనే కాదు… బయట కూడా మనసు చాలా మంచింది. పేద పిల్లలు ప్రత్యూష ఫండేషన్ ద్వారా సేవలందిస్తుంది. వారికి హాస్పిటల్ ఖర్చుల దగ్గరనుండి అన్ని తానై ఆ పిల్లలకు సమంత చేయూతనిస్తుంది. ఒక పక్క సినిమాలు మరోపక్క సేవా కార్యక్రమాలతో సమంత ఎప్పుడూ బిజినే. అలాంటి సమంత రైతు మార్కెట్ కి వెళ్లి షాపులో కూర్చుని కూరగాయలమ్మితే ఆ సీన్ చూడడానికి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.

కూరగాయాలు అమ్మి……

చెన్నై లోని తిరువ‌ళ్లిక్కేణి ప్రాంతంలో ఫేమ‌స్ అయిన జాంబ‌జార్ మార్కెట్లో ఒక చిన్న కూర‌గాయ‌ల దుకాణం వ‌ద్దకు వెళ్లిన స‌మంత‌.. అక్కడ ఆ కూరగాయల కౌంట‌ర్లో కూర్చొని కూర‌గాయ‌లు అమ్మడం.. అక్కడి కూరగాయలు క్షణాల్లో అమ్ముడుపోవడం… చూస్తుంటే సమంత కున్న క్రేజ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. మామూలుగానే సమంత ఏదన్నా షాప్ ఓపెనింగ్ కి వచ్చిందంటేనే అక్కడ జన సందోహం ఎలా ఉంటుందో చాలాసార్లు చూసాం. ఇక చక్కని చీరకట్టుకుని కూరగాయలమ్ముతానంటే ఊరుకుంటారా ఎగబడి కొనరు.

చిన్నారులకు సాయం…..

అందుకే కూరగాయలు క్షణాల్లో అమ్మడం చేతికి బోలెడన్ని డబ్బు రావడం కూడా జరిగింది. ఇక సమంత ఆ కూరగాయలమ్మిన డబ్బుతో… గుండె జ‌బ్బుల‌తో బాధ ప‌డే చిన్నారుల‌కు సాయం అందించేందుకు చేసింది. ఇందులో వ‌చ్చే మొత్తంతో కొంద‌రు చిన్నారుల‌కు సమంత సాయం చేయ‌నుంది. ఈ రకమైన కార్యక్రమం లక్ష్మి మంచు నేను సైతం ప్రోగ్రాం ద్వారా పెద్దవాళ్ళని ఆదుకోవడానికి సెలబ్రిటీస్ ద్వారా షాప్ లో కూరగాయలు, పెట్రోల్, బ్యాంకు లో పెట్రోల్ కొట్టించడం, సినిమా థియేటర్స్ లో పాప్ కోరిన అమ్మడం వంటివి చేసి వచ్చిన డబ్బుకి మరికొంత ఆ సెలబ్రిటీస్ ద్వారా సాయమందించేది. ఇక ఇప్పుడు సమంత కూడా అనాధ పిల్ల సహాయార్ధం ఇలా కూరగాయలమ్మి తన మనసు వెన్న అని నిరూపించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*