అబ్బ చాన్నాళ్ళకి హిట్ పడిందిగా..!!

ప్రస్తుతం చాలారోజుల నుండి బాలీవుడ్ ప్రేక్షకులు హిట్ సినిమాకి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చేవూస్తున్నారు. పద్మవత్ అనే లేడి ఓరియెంటెడ్ గా తెరకెక్కడం.. ఆ సినిమా అనేక వివాదాల నడుమ విడుదలవడం.. తర్వాత ఆ సినిమా హిట్ అయినప్పటికీ అది ఒక లేడి ఓరియెంటెడ్ గానే మిగిలిపోయిది. ఇక మొన్నామధ్యన వచ్చిన అలియా భట్ నటించిన రాజి చిత్రం కూడా లేడి ఒరియెంటెడ్ చిత్రం కావం అది కూడా హిట్ అవడం జరిగాయి. కానీ ఒక్క పెద్ద హీరో సినిమా కూడా విడుదలై విజయం సాధించలేదు. రంజాన్ స్పెషల్ గా వచ్చిన సల్మాన్ ఖాన్ రేస్ 3 కూడా అట్టర్ ప్లాప్ చిత్రంగా మిగిలింది. అందుకే బాలీవుడ్ ప్రియులు భారీ బడ్జెట్ అండ్ స్టార్ హీరోల నుండి వచ్చే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.

సూపర్ హిట్ టాక్….

నిన్న శుక్రవారం భారీ బడ్జెట్ తో హిట్ చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో సంజయ్ దత్ బయోపిక్ సంజు సినిమా విడుదలైంది. రణబీర్ సింగ్ సంజయ్ దత్ పాత్రలో నటించిన ఈ సంజు సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు భాయ్ ఓపెనింగ్స్ తో రికార్డు సృష్టించింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని. ఆయన తెరకెక్కించిన మున్నాబాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాబాయ్, 3 ఇడియట్స్, పీకే ఇలా ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ మాత్రమే కాదు.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొల్లగొట్టిన అద్భుతమైన మరపురాని దృశ్యకావ్యాలు. అలాంటి దర్శకుడు సంజయ్ దత్ బయో పిక్ తీస్తున్నాడు అంటే.. ఎలా తీస్తున్నాడో అనే క్యూరియాసిటీ మాములుగా రాలేదు ప్రేక్షకుల్లో.

ఇరగదీసిన రణబీర్ కపూర్…..

కానీ రాజ్ కుమార్ హిరాని సంజయ్ దత్ బయో పిక్ ని అందరూ మెచ్చేలా తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో ఇరగదీసాడు. రణబీర్ హావ భావాలూ. అతని నటన అన్ని.. సంజయ్ దత్ నే చూస్తున్నాము అనే ఫీలింగ్ తెప్పించాయి. అసలు సంజయ్ పాత్రలో రణబీర్ జీవించేసాడు. అందుకే రణబీర్ నటనకు ఫుల్ అంర్కులు పడిపోతున్నాయి. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ నుండి క్రిటిక్స్ అద్భుతంగా రివ్యూస్ ఇచ్చారు. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు సైతం సంజుకి బ్రహ్మరధం పడుతున్నారు. హిట్ సినిమాకి మొహం వాచిపోయిన బాలీవుడ్ సినీప్రియులకి ఈ సినిమా కాస్త రిలీఫ్ నిచ్చింది. అలా సంజు సినిమా ఈ ఏడాది మొదటి భారీ హిట్ కొట్టిందని టాక్ వస్తుంది కూడా. మరి ఈ సినిమా చూసిన చాలామంది అబ్బా చాన్నాళ్ళకి బాలీవుడ్ లో హిట్ బొమ్మపడిందంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*