సై రా మీద మరింత అంచనాలు పెరిగేలా

చిరంజీవి సై రా నరసింహారెడ్డి షూటింగ్ అప్ డేట్ గత రెండు రోజులుగా మీడియాలో విపరీతంగా వినబడుతూనే ఉంది. 40 కోట్ల భారీ బడ్జెట్ తో కేవలం 35 రోజుల్లోనే సై రా నరసింహారెడ్డి కి ఆంగ్లేయులకు మధ్య జరిగిన యుద్ధ సన్నివేశాలను దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతికూల వాతారవణంలోను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసాడని.. ఆ విషయమై ఈ సినిమా కెమెరామన్ రత్నవేలు కూడా సై రా షూటింగ్ గురించి ఆ భారీ షెడ్యూల్ గురించి సినిమా మీద మరింత క్రేజ్ అండ్ హైప్ పెంచే మాటలు మట్లాడాడు. ఇక చిరు కూడా ఈ షెడ్యూల్ కోసం రాత్రినక పగలనక కష్టపడ్డాడని ఆయన కున్న కమిట్మెంట్ కి అందరూ అభినందించారు.

అయితే అంత భారీగా చిత్రీకరించిన సై రా సినిమా షూటింగ్ స్పాట్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో లీకైయ్యాయి. ఇప్పుడా ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. నిజంగానే రత్నవేలు చెప్పడం కాదుగాని. సై రా కి సంబందించిన ఆ లీకెడ్ పిక్స్ చూస్తుంటే… ఈ సినిమాకి ఈ యాక్షన్ పార్ట్ మెయిన్ హైలెట్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కనబడడం లేదు. అంత భారీ తనంతో కూడుకున్న ఈ సెట్స్ చూస్తుంటే.. సై రా సినిమా కోసం రామ్ చరణ్ పెడుతున్న భారీ ఖర్చు కూడా కనబడుతుంది. మరి భారీగా ఈ సెట్స్ మధ్య ఆంగ్లేయులకు సై రా నరసింహారెడ్డి కి మధ్య జరిగిన వార్ తాలూకు కోట తగలబడుతున్న సీన్…. బ్రిటిష్ జవాన్ల దుస్తుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆర్టిస్టుల ఫొటోస్ తో కూడిన పిక్స్ అవి.

మరి ఎంతో భారీగా ఎంతో హైప్ తో ఉన్న సై రా నరసింహారెడ్డి పిక్స్ ని ఎవరు లీక చేశారో తెలియదు గాని.. ఈ ఫొటోస్ మాత్రం సినిమా మీద మరింత క్రేజ్ పెరిగేలా చేశాయి. కానీ ఇలా పిక్స్ దర్శకనిర్మాతలు అనుమతులు లేకుండా బయటికొచ్చేయడం అనేది సై రా బృందాన్ని విస్మయానికి, షాక్ కి గురిచేశాయి. ఇంతకు ముందే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ అరవింద సమేత సినిమా పిక్స్ కూడా ఇలాగే లీకై సోషల్ మీడియాని ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే. మరి దర్శకనిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఇలాంటివి పదే పదే జరగడం మాత్రం కాస్త సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*