‘సైరా’ షూటింగ్ కావాలనే స్లో చేస్తున్నారా?

సై రా నరసింహ రెడ్డి

చిరంజీవి వయసు..స్టామినాను దృష్టిలో పెట్టుకుని ‘సైరా’ సినిమాను స్లో అండ్ స్టడీ టైపులో తీస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన సినిమా కాబట్టి చిరంజీవికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా డైరెక్టర్ సురేంద్ర రెడ్డి సినిమాను చాలా ప్లాన్డ్ గా తీస్తున్నారు. అందుకే ఈ సినిమా రిలీజ్ కూడా వచ్చే ఏడాది సమ్మర్ లో అనుకుంటున్నారు. కానీ వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమా రెడీ అయితే అద్భుతమే అంటున్నారు ఫిల్మనగర్ వర్గాలు.

దానికి తోడు గత నెల చివరిలో భారీ వర్షాలు పడటం వల్ల ‘సైరా’ షూటింగ్ కి అంతరాయం కలిగింది. ఇప్పటివరకు అయితే 40 శాతం వర్క్ మాత్రమే ఫినిష్ అయినట్టు తెలుస్తుంది. కానీ ఫినిష్ అయినా వర్క్ లో సినిమాలో హెవీ గ్రాఫిక్స్ ఉన్న సీన్స్ అన్ని ముందే కంప్లీట్ చేశారు. అంతవరకు హ్యాపీయే. ఇక మిగిలిన సీన్స్ సాంగ్స్ మీద పడనున్నారు టీం.

షూటింగ్ కు సంబంధించి అన్ని సీన్స్ 2019 ఏప్రిల్ నాటికి పూర్తి అవచ్చని అంచనా వేస్తున్నారు మేకర్స్. సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏప్రిల్ కళ్ల సినిమా షూటింగ్ తో పాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా ఫినిష్ చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్లో గా చేసుకున్న దసరా టైంకి ఈ సినిమా రావడం పెద్ద కష్టమేమి కాదు అని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ మరో రెండు రోజుల్లో మనముందుకు రానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*