‘సవ్యసాచి’ గురించి ఎవరికి తెలియని విషయం..!

Savyasachi closing collections

డైరెక్టర్ చందూ మొండేటి – నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. ‘ప్రేమమ్’ తరువాత మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. నవంబర్ 2న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. టీజర్, ట్రైలర్ బట్టి ఈ సినిమా కథ ఏంటో ఊరికే అర్థం అయిపోతుంది. ‘వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌’ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో అదొక్కటే పాయింట్ కాదని డైరెక్టర్ చందూ మొండేటి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇందులో చక్కటి ఫామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయని..తన స్నేహితుడు ‘వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌’ కాన్సెప్ట్‌ గురించి చెబితే విన్నాననీ, తరవాత కథలో పెట్టానని ఆయన చెప్పారు. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ అండ్ కామెడీ తో సరదాగా సాగిపోతుందని సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలు అవుతుందని తరువాత ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ వుంటాయని చందూ మొండేటి చెప్పారు.

కన్నడ సినిమాతో సంబంధం లేదు…

కన్నడలో జూన్ లో రిలీజ్ అయిన ‘సంకష్ట కర గణపతి’ అనే సినిమా కాన్సెప్ట్ మీ సినిమా కాన్సెప్ట్ ఒకేలా ఉందని ప్రశించగా… ఆ సినిమా 2 నెలల కిందట రిలీజ్ అయింది..మా సినిమా ఎప్పుడో మొదలైంది. అయినా ఒకే కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు రావొచ్చు అందులో తప్పు ఏమి ఉంది. ఉదాహరణకు… మతిమరుపు మీద ‘గజని’ వచ్చింది. తరువాత ‘భలే భలే మగాడివోయ్‌’ కూడా వచ్చింది కదా..! ఆలా ఒక్క కాన్సెప్ట్ మీద ఎన్ని సినిమాలైనా రావొచ్చు. ఇది కూడా అంతే అని చందూ అన్నారు. చిన్న సినిమాగా తీయాలనుకున్నా మైత్రి మూవీస్ వారి సహకారంతో పెద్ద సినిమాగా మారిందని అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*