సినిమా మీద నమ్మకంతోనే అంత రేటు..!

top writer story for naga chaitanya film

చందు మొండేటి.. నాగ చైతన్య హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా మాధవన్ ని ఒక కీలకపాత్రకి తీసుకుని సవ్యసాచి సినిమాని డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా మీద మొదట్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ మధ్యలో ఏమైందో సవ్యసాచి సినిమాని పక్కన పెట్టేసి నాగ చైతన్య, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శైలజ రెడ్డి అల్లుడు కోసం జంప్ అయ్యాడు. కారణాలు తెలియవు గాని నాగ చైతన్య సవ్యసాచి కన్నా ఎక్కువగా శైలజ రెడ్డి అల్లుడు మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే టాక్ కాస్త గట్టిగానే వినబడింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ పెట్టుబడి పెట్టిన సవ్యసాచి సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇపుడు ఉన్నట్టుండి ఇంకా ఫైనల్ గా ఈ చిత్రం టాకీ పార్ట్ ఆగస్టు 8కి పూర్తవుతుందని… అలాగే మిగిలిన ఒక పాటను ఆగస్టు 15 నుండి ఫారిన్ లొకేషన్స్ లో తెరకెక్కిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే ఇలా ఉన్నట్టుండి సవ్యసాచి టీమ్ ఈ సినిమా పై ప్రకటన ఇవ్వడానికి కారణం నిన్న శైలజ రెడ్డి అల్లుడు సినిమా ఆగస్టు 31న విడుదల డేట్ ఫిక్స్ చెయ్యడంతో సవ్యసాచి దర్శక నిర్మాతలు కంగారు పడి సాయంత్రానికల్లా సవ్యసాచి షూటింగ్ అప్ డేట్ మీడియాకి వదిలారు.

సవ్యసాచిపై భారీ అంచనాలు…

మరి శైలజ రెడ్డి అల్లుడు సినిమా సవ్యసాచి కన్నా లేట్ గా మొదలైన సినిమా. అయితే సవ్యసాచి సినిమాలో మాధవన్, భూమిక కీలకపాత్రలు పోషించడం, పెద్ద బ్యానర్ నిర్మించడం.. చందు మొండేటి మీద అంచనాలుండడం.. అలాగే సవ్యసాచి సినిమా పోస్టర్స్ కి మంచి స్పందన రావడంతో.. ఇప్పుడు సవ్యసాచి థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగిందని టాక్ వినబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల హక్కులు 9.5 కోట్లకు అమ్ముడైనట్టుగా సమాచారం. అలాగే సవ్యసాచి కర్ణాటక విడుదల హక్కులు కూడా భారీ రేటుకే అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ నాటి కల్లా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా కంప్లీట్ చేసి సినిమా విడుదల తేదీ ప్రకటిస్తారని తెలుస్తుంది.

వెంటనే సమంతతో మరో చిత్రం

ఇక నాగ చైతన్య కి సవ్యసాచి సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయితే శివ నిర్వాణ దర్శకత్వంలో తన భార్య సమంత తో కలసి ఒక కుటుంబ కథా చిత్రంలో నటించాల్సి ఉంది. ఇకపోతే మొన్నటివరకు శైలజ రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాల విడుదల డేట్స్ క్లాష్ అవుతాయనుకున్నారు. కానీ తాజాగా శైలజ రెడ్డి అల్లు ఆగస్టు 31 కి ఫిక్స్ అయితే సవ్యసాచి సెప్టెంబర్ కి వెళ్లిపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*