ఎట్టకేలకు ‘సవ్యసాచి’ కు డేట్ దొరికింది..!

టాలీవుడ్ లో తక్కువ సినిమా తీసి ఎక్కువ పేరు తెచ్చుకున్న బ్యానర్…మైత్రీ మూవీస్. ఈ సంస్థ నుండి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ నుండి రెండు సినిమాలు వరసగా వస్తున్నాయి. నాగ చైతన్య – చందూ మొండేటి కాంబినేషన్ లో వస్తున్న ‘సవ్యసాచి’ని అక్టోబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేద్దాం అనుకుంటే కరెక్ట్ వారానికి నాగార్జున – నానిల మల్టీ స్టారర్ మూవీ రెడీగా ఉంది.

రవితేజ సినిమా కూడా ఉండటంతో

ఇంకా ఆదే టైంలో అంటే అక్టోబర్ 4న రవితేజ -శ్రీను వైట్లల మూవీ ‘అమర్-అక్బర్-ఆంథోని’ని షెడ్యూలు చేసారు మేకర్స్. ఈ సినిమాపై శ్రీను వైట్ల..రవితేజకే కాకుండా సాధారణ ప్రేక్షకులకి కూడా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఒకే.. మరి ‘సవ్యసాచి’ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు మేకర్స్ కు ఓ కత్తిలాంటి డేట్ దొరికింది.

భలే డేట్ పట్టుకున్న మేకర్స్

నవంబర్ 2న ఈ సినిమాను షెడ్యూలు చేసారు మేకర్స్. కరెక్ట్ గా నవంబర్ 2 నుండి నవంబర్ 7 వరకు సెలవులే కాబట్టి ఈ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. లేటెస్ట్ గా వీరి బ్యానర్ లో ‘రంగస్థలం’ సినిమా ఎంత సక్సెస్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న టైంలో వరసగా రెండు సినిమాలతో హడావుడి చేయనున్నారు. మరోపక్క విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*