మంచు లక్ష్మికీ లైంగిక వేధింపులు…!

మోహన్ బాబు కూతురుగా తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టి తనదైన శైలిలో నటించి..ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మంచు లక్ష్మి ఈమధ్య సోషల్ మీడియాలో తెగ కనపడుతుంది. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండే ఈమె ఓ సంచలనమైన విషయం చెప్పింది. తాను కూడా లైంగిక వేధింపులకు ఎదుర్కొన్నానని సెన్సేషనల్ న్యూస్ చెప్పింది.

నిజ జీవితంలో…..

గత కొన్ని రోజులు నుండి ఇండియా మొత్తం మహిళపై లైంగిక వేధింపులు గురించి పెద్ద చర్చ నడస్తుంది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ ఈ లైంగిక వేధింపులకు గురైనట్టు చెప్పారు. తెలుగు నుండి అలా ఎవరు స్పందించలేదు. కానీ లక్ష్మి నేను కూడా లైంగిక వేధింపులకు ఎదుర్కొన్నానని తెలిపింది. అయితే సినిమా ఇండస్ట్రీలో వేధింపులను ఎదుర్కోలేదని… నిజ జీవితంలో ఎదుర్కొన్నానని చెప్పింది. అయితే వారు ఎవరో..ఎందుకు ఆలా చేసారో మాత్రం చెప్పలేదు.

నెటిజన్ అడిగిన ప్రశ్నకు…..

సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది ఇలా ఉండగా మేము సైతం అనే టీవీ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో ‘పవన్ కల్యాణ్ ను ఈ కార్యక్రమానికి తీసుకురావచ్చు కదా’ అని ఓ నెటిజన్ అడిగాడు. పవన్ కళ్యాణ్ ని తీసుకుని రావడానికి చాలా ట్రై చేశాను. కానీ అయన నుండి ఎటువంటి సమాధానం లేదు అని చెప్పింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*