అల్లుడుగారు సేఫ్ జోన్ ఎంతంటే..

వినాయక చవితి సందర్భంగా నాగ చైతన్య నటించిన ‘శైల‌జారెడ్డి అల్లుడు’ సినిమా విడుదలై డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ చైతు కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈసినిమా వసూల్ చేసింది. తొలి నాలుగు రోజులు ముగిసేసరికి ఈచిత్రం రూ.15 కోట్ల దాకా షేర్ రాబ‌ట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి రూ.11.6 కోట్ల షేర్ రాబట్టగా…అమెరికాలో రూ.1.5 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇక మిగిలిన ఏరియాస్ లో రెండు కోట్ల దాకా వసూల్ చేసి చైతూ కెరీర్లో అతి పెద్ద హిట్‌గా నిలిచింది.

అంతకుముందు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం కంటే తొలి నాలుగు రోజుల్లో కలెక్షన్స్ శైల‌జారెడ్డికే వచ్చాయి. ఈచిత్రం ఇంతలా వసూల్ చేస్తున్నప్పటికీ ఇంకా సేఫ్ జోన్లోకి రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం రూ.18.5 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ జరిగితే, ఇప్పటివరకు రూ.11.6 కోట్ల మాత్రమే వచ్చాయి. అంటే ఇంకా రూ.7 కోట్ల దాకా షేర్ రావాల్సిఉంది.

అమెరికాలో సేఫ్ జోన్లోకి రావాలంటే రూ.3.5 కోట్ల షేర్ రాబ‌ట్టాలి. ఈలెక్కన చూసుకుంటే ఈసినిమా ఈవారం మొత్తం బాగా ఆడాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఈవారం మూడు మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సుధీర్ బాబు ‘న‌న్ను దోచుకుందువ‌టే’.. విక్ర‌మ్ ‘సామి’ తో పాటు ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో ఏ సినిమా ఐన మంచి టాక్ దక్కించుకుంటే ‘శైల‌జారెడ్డి అల్లుడు’ కలెక్షన్స్ కి బ్రేక్ పడే అవకాశాలు లేకపోలేదు. చూద్దాం ఏం జరుగుతుందో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*