‘శైలజా రెడ్డి అల్లుడు’కి ఓవర్సీస్ లో భారీ రేటు

top writer story for naga chaitanya film

నాగ చైతన్య అనగానే మనకి ముందుగా అతను ఓ క్లాస్ హీరో అని గుర్తు వస్తుంది. అయితే ప్రేక్షకుల్లో ఆ మచ్చ పోగొట్టటానికి.. తను మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి నాగచైతన్య చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అన్ని వర్గాలని ఆకట్టుకునేందుకు చైతు కథలు ఎంచుకోటం స్టార్ట్ చేశాడు. దాంతో ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ వైపు నుంచి కూడా క్రేజ్ పెరుగుతూ వచ్చింది.

రెండు సినిమాలకూ భారీ ధర…

ఓవర్సీస్ లో అయన సినిమాలకి మంచి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో చైతు ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఓవర్సీస్ లో 3 కోట్ల 15 లక్షలకు అమ్ముడైంది. ఇక చందూ మొండేటితో చేస్తోన్న ‘సవ్యసాచి’ సినిమా ఓవర్సీస్ హక్కులు 3 కోట్ల 20 లక్షలకి అమ్ముడయ్యాయి. మరి మనోడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్ లో కూడా తన స్టామినా చూపిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో చైతు సినిమా ఉండనుంది. ఇందులో సమంత హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. ఇది లవ్ స్టోరీ అని తెలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*