బాక్సాఫీస్ వద్ద భార్యభర్తల హవా..!

ఈ వారం రిలీజ్ అయిన భార్యభర్తల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద జోరు కొనసాగిస్తున్నాయి. సమంత నటించిన ‘యూ-టర్న్’…నాగ చైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాల హవా బాక్సాఫీస్ వద్ద సాగుతోంది. ‘యూ-టర్న్’ చిత్రం ఎవరు ఊహించని విధంగా తొలిరోజు 2 కోట్లు వసూళ్లు సాధిస్తే.. ‘శైలజారెడ్డి అల్లుడు’ నాగచైతన్య కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 12కోట్లు వసూల్ చేసి కెరీర్ బెస్ట్ గా నిలిచింది.

దూసుకుపోతున్న శైలజారెడ్డి అల్లుడు

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తున్నాయి. ‘యూ-టర్న్’ మొదటిరోజు 2 కోట్ల గ్రాస్ వసూలు చేయగా..అందులో కోటి 10 లక్షల షేర్ వచ్చింది. చైతు ‘శైలజారెడ్డి అల్లుడు’ తొలిరోజు 12కోట్ల గ్రాస్ వసూల్ చేయగా..6.50 కోట్ల షేర్ ను వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ‘యూ-టర్న్’ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటంతో అదే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక చైతు సినిమాకి మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ అవన్నీ తుడిచి పెట్టేసి కలెక్షన్స్ ల సునామీ సృష్టించింది.

వీకెండ్ లోనూ వసూళ్ల జోరు…

ఈ రెండు సినిమాలకు ప్లస్ పాయింట్ ఏంటంటే వినాయక చవితి రోజు విడుదల అవ్వడం. దీనికి తోడు వీకెండ్ కావడం. శని – ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు. అంటే తొలి నాలుగు రోజుల్లో ఈ రెండు సినిమాలు చక్కని వసూళ్ల తో ట్రేడ్ లో ఉత్సాహం నింపే ఛాన్సుంది. 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘యూ-టర్న్’ మరో రెండు రోజుల్లో సేఫ్ జోన్ కి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు. అదే విధంగా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ రెండు రోజులు జోరు కొనసాగిస్తే ఇది కూడా సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అని ట్రేడ్ అంటున్నారు. మరి వీకెండ్ రిపోర్ట్ ఏం వస్తుందో అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1