దూసుకుపోతున్న శైలజారెడ్డి అల్లుడు..!
నాగ చైతన్య - అను ఇమ్మాన్యువల్ జంటగా కామెడీ ఎంటర్టైనెర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శైలజారెడ్డి అల్లుడు మూవీ ఫస్ట్ వీకెండ్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో శైలజారెడ్డి అల్లుడు బాగానే వసూలు చేసాడు. శైలజారెడ్డి గా ఈగో పాత్రలో రమ్యకృష్ణ నటించిన ఈ సినిమాలో మురళి శర్మ, అను ఇమ్మానువెల్ కూడా ఈగో పర్సన్స్ గా అదరగొట్టారు. అలాగే ఈ ముగ్గురు ఈగోయిస్టుల మధ్యన ఒక కుర్రాడు ఎలా మేనేజ్ చేసాడు అనేది శైలజారెడ్డి స్టోరీ. ప్రస్తుతం ఫస్ట్ వీకెండ్ లో బాగానే లాగిన శైలజారెడ్డి అల్లుడు ఈ సోమవారం నుండి వచ్చే కలెక్షన్ ఇంకా కీలకం కానున్నాయి. శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ వీకెండ్ రెండు తెలుగు రాష్టాల కలెక్షన్స్...
ఏరియా షేర్స్ (కోట్లలో)
నైజాం 3.70
సీడెడ్ 2.11
నెల్లూరు 0.50
కృష్ణ 0.86
గుంటూరు 1.15
వైజాగ్ 1.35
ఈస్ట్ గోదావరి 1.33
వెస్ట్ గోదావరి 0.80
టీఎస్ అండ్ ఏపీ షేర్స్ 11.80