నరకయాతన పడుతూ.. షూటింగ్ చేశా?

నరకయాతన పడుతూ.. షూటింగ్ చేశా.. ఈ మాటన్నది ఎవరో కాదు అర్జున్ రెడ్డి లో విజయ్ దేవరకొండకి జోడీగా నటించిన షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ సమయంలో చాలా సీన్స్ చేసేటప్పుడు తానూ నరకయాతన అనుభవించానని చెబుతుంది. అయితే తనకి అర్జున్ రెడ్డి షూటింగ్ సమయంలో ఎలాంటి చేదు సంఘటను ఎదురుకాలేదుకాని.. తనకి వేరే విషయంలో ఉన్న బాధ వలన అర్జున్ రెడ్డి షూటింగ్ సమయంలో నరకయాతన అనుభవించానని చెబుతుంది. అర్జున్ రెడ్డి సినిమాలో బేబీ అంటూ బోల్డ్ సీన్స్ లోనూ అదరగొట్టే పెరఫార్మెన్స్ చేసిన షాలిని పాండే నటనలోకి వస్తానంటే.. ఆమె పేరెంట్స్ కాదు కూడదని చెబితే ఇల్లు వదిలి వచ్చేసిందట.

రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్…

ఇక ఇల్లువిడిచి వచ్చాక తాను ముంబై లో అద్దె ఇల్లు తీసుకున్నాని.. ముంబైలో అద్దె ఇంట్లో ఉండడానికి ఒంటరి ఆడపిల్లకి అద్దె ఇల్లు దొరకదని… అందుకే మరో అమ్మాయి ఇద్దరి అబ్బాయిలతో ఆ ఇల్లు షేర్ చేసుకున్నానని, కానీ ఆ అబ్బాయిలెప్పుడు తనని చెడు దృష్టిలో చూడలేదని చెప్పిన షాలిని పాండే. తాను కాలేజీ లో చదువుతున్న రోజుల్లోనే రెండుసార్లు ప్రేమలో పడి.. అవి కాస్త విఫలమయ్యాయని చెప్పింది. ఇక అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ టైం లో కూడా తాను లవ్ లో ఫెయిల్ అయ్యి…. బాధపడుతున్నానని.. అందుకే హీరో కాంబినేషన్ సీన్స్ లో నటించేటప్పుడు నరకయాతన అనుభవించానని… అంత బాధలోనే ఆ షూటింగ్ పూర్తి చేశానని… చెప్పుకొచ్చింది.

తమిళ్ లో ఫుల్ బిజీ…

మరి షాలిని కి ప్రేమలో అనుభవం ఉండబట్టేనేమో.. అర్జున్ రెడ్డి సినిమాలో ఎలాంటి మొహమాటాలకు పోకుండా కిస్సింగ్ సీన్స్ లో అదరగొట్టింది. నిజమైన బాధలో ఉండబట్టే… అర్జున్ రెడ్డి తో పెళ్లి ఆగిపోయినప్పుడు శాడ్ ఫేస్ ఎక్సప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఇక అర్జున్ రెడ్డి హిట్ తో అమ్మడు ప్రస్తుతం తమిళంలో ఫుల్ బిజీ అయ్యింది. అలాగే మహానటి లో సావిత్రి ఫ్రెండ్ సుశీల కేరెక్టర్ లో నటించి అదరగొట్టింది.

1 Comment on నరకయాతన పడుతూ.. షూటింగ్ చేశా?

Leave a Reply

Your email address will not be published.


*