కమల్ తో యాక్ట్ చేయాలనీ నా కోరిక

Kamal Hasan going to quit acting

‘అర్జున్ రెడ్డి’తో విజయ దేవరకొండే కాదు హీరోయిన్ షాలినీ పాండేకి కూడా యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు వరసబెట్టి ఆఫర్స్ వచ్చాయి. తెలుగులో పాటు తమిళలో కూడా ఆమె ఆఫర్స్ వరిస్తున్నాయి. కాకపోతే ఆమె ఏ స్టోరీ వస్తే అది చేయట్లేదట. తనకు కథ నచ్చితేనే చేస్తుందంట.

లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో షాలినీ మాట్లాడుతూ.. తెలుగులో నా మొదటి సినిమాకే అంత క్రేజ్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక తమిళంలో జీవీ ప్రకాష్ సరసన ‘100% కాదల్’ నటిస్తున్న. ఆ సినిమా నాకు మంచి గుర్తింపును తీసుకొస్తుందని భావిస్తున్నాను. తెలుగు భాషతో పాటు తమిళం కూడా నేర్చుకుంటున్న.

నాకు ధనుష్ యాక్టింగ్ అన్న.. ఆయన వేసే డాన్స్ అన్న ఇష్టమని చెబుతుంది. ఇక కమల్ హాసన్ పట్ల నాకు ఉన్న అభిమానాన్ని మాట్లల్లో చెప్పలేనని.. నాకు ఆయనతో నటించాలని కోరిక ఉంది.. ఒకవేళ అది జరిగితే నా అంత లక్కీ గర్ల్ ఎవరు లేనట్టే అని చెప్పుకొచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*