గ్రాఫిక్స్ టీం కి వార్నింగ్ ఇచ్చిన శంకర్

2.0 collections telugu cinema news

రజినీకాంత్ – శంకర్ ల కాంబోలో తెరక్కేక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ సినిమా అసలైతే ఈ ఏడాది మొదట్లో నే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అమెరికాలోని ఒక గ్రాఫిక్స్ కంపెనీ చేసినపని వలన 2.ఓ గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ కాక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే మధ్యలో సినిమా మీద క్రేజ్ తగ్గిపోతున్నది.. అందుకే 2.ఓ సినిమా రైట్స్ కొన్న కొంతమంది బయ్యర్స్ 2.ఓ నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ కి ఇచ్చిన అడ్వాన్స్ లు వెనక్కి ఇవ్వమని ఒత్తిడి రావడం…. కొంతమంది 2.ఓ డీల్ నుండి వెనక్కి తగ్గడం జరుగుతున్న టైం లో సడన్ గా ఒక రోజు దర్శకుడు శంకర్ లైన్ లోకొచ్చి 2.ఓ గ్రాఫిక్స్ పనులు ఒక కొలిక్కి వస్తున్నాయని… విజువల్ ఎఫెక్ట్స్ కి పనిచేసే వారు తనకి హామీ ఇచ్చారని. అందుకే 2.ఓ సినిమాని నవంబర్ 29 న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

అయితే శంకర్ అయితే 2.ఓ సినిమా విడుదల నవంబర్ 29 అని చెప్పినప్పటికీ కొంతమంది ఆనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా కొందరు డౌట్ పడ్డట్టుగానే.. 2.ఓ గ్రాఫిక్స్ టీం కి దర్శకుడు శంకర్ డెడ్ లైన్ విధించినట్లుగా ప్రచారం మొదలైంది. అక్టోబర్ 15వ తేదీలోపు ఈ చిత్రం యొక్క గ్రాఫిక్స్ కంటెంట్ మొత్తం రెడీ అయిపోవాలని… ఎలాంటి ఆలస్యం గ్రాఫిక్స్ వర్క్ విషయంలో ఉండకూడదని 2.ఓ గ్రాఫిక్స్ టీంకు దాదాపుగా వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పాడనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది. మరి శంకర్ సినిమా మీద క్రేజ్ పోతుందని.. బయ్యర్స్ చేస్తున్న హడావిడికి లోబడి సినిమాని నవంబర్ 29 విడుదల అంటూ మాటిచ్చాడు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ మాత్రం ఒక కొలిక్కి వచ్చేట్లుగా కనబడ్డం లేదు గనకే .. శంకర్ గ్రాఫిక్స్ టీం మీద ఫైర్ అవుతున్నాడట.

ఇప్పటికే 2.ఓ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడడం.. మళ్ళీ ఇప్పుడు గనకవాయిదా పడితే సినిమా మీద క్రేజ్ తగ్గుతుందని శంకర్ ఇలా హడావిడి పడుతున్నాడట. మరి అక్టోబర్ 15 కల్లా విజువల్ ఎఫెక్ట్స్ గనక కంప్లీట్ అయితే.. ఆతర్వాత ఎలాగూ రీ రికార్డింగ్ తో పాటు మిగితా పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులకు కలిపి మరో నెల సమయం పడుతుంది. అందుకే శంకర్ కంగారు పడుతున్నాడట. మరి భారీ బడ్జెట్ చిత్రం ఇలా వాయిదాల మీద వాయిదాలు పడితే ఆ చిత్ర నిర్మాతలకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకున్న శంకర్ ఎలాగైనా సినిమాని నవంబర్ 29 న విడుదల చెయ్యాలని కంకణం కట్టుకున్నాడట. ఇక 3000 మంది టెక్నీకల్ గా పనిచేస్తున్న ఈ చిత్ర టీజర్ ఈ మధ్యనే విడుదలై సంచలనాలు నమోదు చేసింది. హీరోగా రజినీ కాంత్ , విలన్ గా అక్షయ్ కుమార్ , హీరోయిన్ గా అమీ జాక్సన్ లు నటిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*