రైట్స్ తో రేంజ్ పెంచుకున్న శర్వానంద్

Sharwanand film rights price

మహానుభావుడు హిట్ తరవాత శర్వానంద్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ప‌డి ప‌డి లేచె మ‌న‌సు సినిమా చేస్తున్నాడు. ప‌డి ప‌డి లేచె మ‌న‌సు సినిమా డిసెంబర్ 21న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో శర్వానంద్ కి జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. సాయి పల్లవి క్రేజ్, శర్వానంద్ క్రేజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. హను రాఘవపూడి స్టైలిష్ గా, రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించాడు.

భారీ ధరలు హక్కులు…

తాజాగా ఈ సినిమా శాటిలైట్ హ‌క్కులు రికార్డ్ స్థాయికి అమ్ముడుపోయిన‌ట్లు సమాచారం. శర్వానంద్ కెరీర్ లోనే ప‌డి ప‌డి లేచె మ‌న‌సు శాటిలైట్ రైట్స్, డిజిటల్ హక్కులు, హిందీ డబ్బింగ్ రైట్స్ కలిపి మంచి రేటుకు అమ్ముడుపోయింది చెబుతున్నారు. ఇక శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకోగా… డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. శాటిలైట్‌ హక్కులతో పాటుగా అమెజాన్, హిందీ డ‌బ్బింగ్ హక్కులు మొత్తం క‌లుపుకొని 12 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం.

శర్వా కెరీర్ లోనే రికార్డు

మరి ఈ రేటు శ‌ర్వానంద్ కెరీర్‌లోనే ఓ రికార్డుగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ రేంజ్ రేటు రావడానికి మాత్రం సినిమా మీదున్న హైప్ కారణమని చెబుతున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత శర్వానంద్.. సుధీర వర్మ సినిమా కూడా చేస్తున్నాడు. ఎప్పుడో సుధీర్ వర్మ సినిమా మొదలు పెట్టిన రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ మధ్యనే మొదలైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*