డిజాస్టర్ డైరెక్టర్ తో శర్వానంద్..!

maruthi next film with sharwanand

నిఖిల్ తో “కార్తికేయ” లాంటి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ చందు మొండేటి ఆ తరువాత నాగచైతన్యతో కలిసి మలయాళం ‘ప్రేమమ్’ ను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు. ‘ప్రేమమ్’ హిట్ అవ్వడంతో మరోసారి నాగ చైతన్యను డైరెక్టర్ చేసే ఛాన్స్ దొరికింది. తన దగ్గర ఓ మంచి కథ ఉందని “సవ్యసాచి” కథను చెప్పాడు చందు. ఈ సబ్జెక్టుకు ముందు చందు ఇంకో ఇంట్రెస్టింగ్ కథ చెప్పాడు. అయితే ఆ కథ కన్న ఇదే బాగుందని నాగార్జున కూడా “సవ్యసాచి”నే ముందు తీయమన్నాడు.

చైతూకి చెప్పిన కథతోనే…

దాంతో ఆలా సెట్స్ మీదకు వెళ్ళింది “సవ్యసాచి”. కానీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే చైతుకి చెప్పిన కథను వేరే హీరోకి చెసుదామని చందూ ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే హీరో శర్వానంద్ ని కలిసి లైన్ కూడా చెప్పాడట. శర్వా వెంటనే ఈ లైన్ కి కనెక్ట్ అయిపోయాడట. దాంతో ఈ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది. మొత్తం కథను త్వరలోనే కంప్లీట్ చేసుకుని శర్వా కి చెప్పనున్నాడు చందూ. నిజానికి ఈ కథ కూడా చైతూనే చేయాలి. కానీ “సవ్యసాచి” డిజాస్టర్ అవ్వడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో శర్వాతో చేస్తున్నాడు. డిసెంబర్ 21న విడుదల కానున్న పడి పడి లేచె మనస్సు తర్వాత శర్వానంద్ ఈ సినిమా చేయనున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*