శేఖర్ కమ్ముల అసిస్టెంట్ ని అంటూ.. మోసాలు?

ఫిదా సినిమాతో పదేళ్ల తర్వాత ఫామ్ లోకొచ్చాడు శేఖర్ కమ్ముల… మొన్నామధ్యన శ్రీ రెడ్డి ఇష్యుతో మరలా హైలెట్ అయ్యింది. శ్రీ రెడ్డి, శేఖర్ కమ్ములను పచ్చిగా తిడుతూ ట్వీట్స్ చెయ్యగా.. శేఖర్ కమ్ముల ఆమె మీది లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్లుగా రిప్లై ఇచ్చాడు. ఇక తర్వాత శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కథ విషయంలో బిజీగా ఉన్నాడు. అయితే మళ్లీ ఇప్పుడు శేఖర్ కమ్ముల పేరు మీడియాలో వినబడుతుంది. శేఖర్ కమ్ముల తాను చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కాదు గాని.. శేఖర్ కమ్ముల పేరు చెప్పుకుని మోసం చేస్తున్న ఒక అబ్బాయి విషయంలో శేఖర్ పేరు మీడియాలో వినబడుతుంది. శేఖర్ కమ్ముల పేరు చెప్పుకుని అవకాశాలిప్పిస్తానంటూ వారి నుండి డబ్బు వసూలు చేస్తున్న ఒక వ్యక్తి ని పట్టుకోవడానికి పోలీస్ లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

పోలీసులను ఆశ్రయించిన శేఖర్ కమ్ముల…

శేఖర్ కమ్ముల అసిస్టెంట్ ని అని చెప్పుకుంటూ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో సినిమా అవకాశాలు ఇప్పిస్తానని… ఒక యాడ్ ని ఆన్లైన్ లో పెట్టడం…. అది చూసిన యువత తమకు అవకాశాలు కావాలంటూ సదరు వ్యక్తిని సంప్రదించగా.. అందుకుగాను కొంత డబ్బు డిపాజిట్ చెయ్యాలని వారికి చెప్పడంతో.. కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు డబ్బుని ఆ వ్యక్తి అకౌంట్ లో వేసారట. అయితే ఎంతకీ తమకి అవకాశాలు ఇప్పించకపోవడంతో.. కొందరు బాధితులు స్వయానా శేఖర్ కమ్ములను కలవగా.. విషయం తెలుసుకుని షాక్ తిన్నాడు. శేఖర్ కమ్ముల వెంటనే పోలీస్ లను సంప్రదించగా.. ఆ వ్యక్తి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారట. మరి ఇలాంటి సంఘటనలు సినిమాల విషయంలో చాలానే జరుగుతున్నాయి. అయినా కొంతమంది తెలివి తక్కువగా దళారులను, మోసగాళ్లను నమ్మి మోసపోతున్నారు. అయినా వారికీ సినిమాల మీదున్న పిచ్చితో ఇలాంటి మోసాలకు బలవుతున్నారు. సినిమాల మీద ఆశతో ఇలా అమాయకులున్నంత కాలం ఇలాంటి మోసగాళ్లకు ఇండస్ట్రీలో కొదవుండదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*