నాన్నని వదిలేసి.. అమ్మ దగ్గరికి వచ్చేసిందా?

తమిళంలో, తెలుగులో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పెళ్లి చేసుకుంటుందేమో అనుకున్నప్పుడు మళ్ళీ సింగిల్ గా కనిపిస్తూ అందరిని కన్ఫ్యూషన్ లో పడేస్తున్న శృతి హాసన్… ప్రస్తుతం ఏం చేస్తుందో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. తెలుగులో కాటమరాయుడు తర్వాత మళ్ళీ కనబడని శృతి హాసన్ తమిళంలోనూ సినిమాలు చెయ్యడం లేదు. ఏదో బాలీవుడ్ లో ఒక సినిమాలో నటిస్తుంది గాని… అమ్మడు ఎక్కువగా ఖాళీగానే ఉంటుంది. మరి శృతి హాసన్ నటనకు గుడ్ బై చెప్పేస్తుందా? ఇక హీరోయిన్ గా సినిమాలు ఒప్పుకోదా? అనే అనుమానాలు మాత్రం తమిళం నుండి తెలుగు దాక అందరి ప్రేక్షకుల్లోనూ మెదులుతుంది.

తండ్రితో కలిసి శభాష్ నాయుడు సినిమాకి పని చేసిన శృతి హాసన్.. ఆ సినిమా టెక్నీకల్ కారణాలతో ఆగిపోవడం.. తర్వాత హీరోయిన్ గా సినిమాలు ఒప్పుకోకపోవడం… ఇలా శృతి హాసన్ సైలెంట్ గానే ఉంటుంది. కెరీర్ పీక్స్ లో ఉండగా… నటనను పక్కన పెట్టేసిన శృతి హాసన్ ఈ మధ్యన నాన్న కమల్ తో కన్నా ఎక్కువగా తల్లి సారిక తోనే కనబడుతుంది. అయితే ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటున్న శృతి హాసన్ నిర్మాణం వైపు మొగ్గు చూపుతుంది. తాజాగా శృతి హాసన్ మాట్లాడుతూ.. మా అమ్మ సారిక, నాన్న కమల్ హాసన్ చాలా చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. నేను కూడా వాళ్ళ వారసురాలిగా సినిమాల్లోకి వచ్చాను. నా తల్లితండ్రులు గర్వపడేలా నా కెరీర్ ని మలుచుకునే పనిలో ఉన్నాను. మరి అలాంటి పనిలో ఉన్న నా పై అంచనాలు ఉండాలనుకోను.. నాకెలా అనిపిస్తే అలానే ముందుకు వెళతాను.

ఇప్పటి వరకు హీరోయిన్ గా అలాగే మా నాన్న సినిమాలకు టెక్నీకల్ సైడ్ కూడా పనిచేసాను.ఇంతవరకు ఆయనతో కలిసి పనిచేసినందుకు ఎంతో గర్వపడుతున్నాను.. అయితే ఇక ఇప్పటినుండి మా అమ్మ సారిక తో కలిసి పని చెయ్యాలని డిసైడ్ అయినట్లుగా శృతి హాసన్ చెబుతుంది. అందులో భాగంగానే తన తల్లితో కలిసిఒక నిర్మాణ సంస్థను ప్రారంభించడం.. ఆ విషయంలో తానెంతో సంతోషంగా ఉన్నట్లుగా చెప్పడం చూస్తుంటే శృతి నటనకు గుడ్ బై చెప్పేసేలాగే కనబడుతుంది. మరి నిర్మాణంలోనే ఉంటుందో.. లేదంటే హీరోయిన్ గా సినిమాలు కూడా చేస్తుందో క్లారిటీ అయితే ఇవ్వలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*