దుబాయ్ లో సైమా వేడుకలు

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) ఫంక్షన్ గ్రాండ్ గా జరగబోతోంది. కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ వేడుకలు సెప్టెంబర్ 7, 8 తేదీలలో దుబాయ్ లో వైభవంగా జరగనుంది. గతంలో సైమా అవార్డ్స్ దుబాయ్, అబుదబి, షార్జాహ్, మలేషియా, దుబాయ్, సింగపూర్, అబుదబి లో జరిగింది. ఈసారి దుబాయ్ లో ఈ వేడుక జరగబోతోంది.

అట్టహాసంగా వేడుకలు

సినీ ప్రముఖుల మధ్య జరగబోతున్న ఈ వేడుక ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. సౌత్ ఇండియన్ స్టార్స్ పాల్గొనబోతున్న సైమా అవార్డ్స్ టైటిల్ స్పాన్సర్ హిమాలయ ఫేస్ వాష్. ఈ అవార్డ్స్ కు సంబంధించిన మరింత సమాచారం త్వరలో తెలియబోతోంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*