‘సిల్లీ ఫెలోస్’ పరిస్థితి ఇది..!

గత కొంత కాలం నుండి సక్సెస్ లు లేక సమతమతమవుతున్న నటుడు అల్లరి నరేష్. అతని నుండి సక్సెస్ అనే మాట విని చాలా ఏళ్లు అయిపోయింది. అతని కామెడీతో విసిగెత్తిపోయిన జనాలు అతని సినిమా అంటే చూడడానికి కూడా ఎవరు థియేటర్స్ కి వెళ్లడం లేదు. అటువంటి పరిస్థితే సునీల్ ది కూడా. నిన్న ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘సిల్లీ ఫెలోస్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీరికి జోడిగా పూర్ణ, చిత్రశుక్ల హీరోయిన్స్ గా నటించారు.

ఫస్ట్ హాఫ్ పర్లేదు అనుకున్నా…

ఈ సినిమా విషయానికి వస్తే.. అనుకున్నంత గొప్పగా ఏమి లేదని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. తమిళంలో హిట్ అయినా ‘వెలైను వంధుట్ట వెల్లకారన్‌’ అనే సినిమాకు రీమేక్ ఇది. అక్కడ నేటివిటికి తగ్గట్టు కాకుండా తెలుగు ప్రేక్షకులకి నచ్చే విధంగా స్టోరీలో కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో నరేష్ – సునీల్ మధ్య కామెడీ సీన్స్ పర్లేదు అనిపించుకున్నాయి.

సెకండ్ హాఫ్ బోర్…

ఇక సెకండ్ హాఫ్ లో పోసాని, జేపీ మధ్య సాగే సన్నివేశాలు జనాలకు విసుగు తెప్పిస్తాయి. దాంతో సెకండ్ హాఫ్ చూసిన ప్రతి ఒక్కరు డల్ అయిపోయారని తెలుస్తుంది. నాసీరకం కామెడీతో తలనొప్పి తెపించారు అని అంటున్నారు. అంతేకాకుండా ఇది చాలా రెగ్యులర్ గా అనిపించే స్టోరీ అంట. దీంతో ఓవర్ అల్ గా ఈ సినిమా ప్లాప్ అని అంటున్నారు. సునీల్ కామెడీ టైమింగ్ లో చాలా చేంజెస్ వచ్చాయని.. ఇదివరకు ఉన్న ఈజ్ అతనిలో లేదని చెబుతున్నారు. మరి నెక్స్ట్ వచ్చే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘అరవింద సమేత’ సినిమాలతో సునీల్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*