సంక్రాంతి సందడి మామూలుగా లేదు..!

tamil films promotions in telugu

వచ్చే సంక్రాంతికి సినిమాల హావా అప్పుడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ మూడు పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయి. డేట్స్ కూడా ప్రకటించాయి. మరో రెండు సినిమాలు డేట్స్ ను త్వరలోనే ప్రకటించనున్నాయి. లిస్ట్ లో మరో 2 సినిమాలు కూడా చేరే ఛాన్స్ ఉంది. సంక్రాంతి పండగకి తెలుగు రాష్ట్రాల్లో సెలవులు కావడంతో దాన్ని కాష్ చేసుకునేందుకు చాలామంది దర్శకనిర్మాతలు ఈ సీజన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సంక్రాంతికి ముందుగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ రానుంది. బాలయ్య లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 9న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ మరో 10 రోజుల్లో ముగియనుంది.

వరుసకట్టి వస్తున్నాయి…

‘ఎన్టీఆర్’ బయోపిక్ వచ్చిన రెండు రోజుల తరువాత రామ్ చరణ్ – బోయపాటిల సినిమా ‘వినయ విధేయ రామ’ జనవరి 11న విడుదల అవ్వబోతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘వినయ విధేయ రామ’ వచ్చిన తరువాత రోజు అంటే జనవరి 12న దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్ – వరుణ్ తేజ్ నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్-2’ విడుదల అవుతుంది. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూడింటితో పాటు లిస్ట్ లోకి మరో రెండు సినిమాలు చేరే అవకాశం ఉంది. తమిళ డబ్ మూవీస్ కూడా ఒకటి రెండు రిలీజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. అంటే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి మాములుగా ఉండదంట..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*