పెళ్ళైన ఇన్నిరోజులకు హానీమూనా?

ఈ మధ్యన సినిమా హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నాక కూడా తమ కెరీర్ ని కొనసాగిస్తూ బిజీగా ఉంటున్నారు. పెళ్లయ్యాక పెళ్లి ముచ్చట్లు తీరకముందే సినిమా షూటింగ్ లోనూ, సినిమా ప్రమోషన్స్ లోను బిజీగా మారుతున్నారు. మొన్నటికి మొన్న టాలీవుడ్ ప్రేమ జంట సమంత – నాగ చైతన్యలు పెళ్లి చెసుకున్న వెంటనే తమ సినిమా షూటింగ్స్ లో బిజీ అయ్యారు. సమంత అయితే ఏకంగా కాళ్లపారాణి ఆరకముందే రాజుగారి గది 2 ప్రమోషన్స్ కోసం వచ్చేసింది. ఇక సినిమా షూటింగ్స్ లో గ్యాప్ వచ్చినప్పుడు భర్త నాగ చైతన్య తో కలిసి మినీ హానీమూన్ అంటూ వెళ్లింది. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా అంతే.

సమంత దారిలోనే సోనమ్…

బాలీవుడ్ లో సోనమ్ కపూర్, ఆమె బాయ్ ఫ్రెండ్ అండ్ లవర్ ఆనంద్ అహూజాల వివాహం రీసెంట్ గా జరిగింది. ఇక పెళ్ళైన వేంటనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడించేందుకు వెళ్లింది సోనమ్ కపూర్. ఇక్క అక్కడినుంచి వచ్చిందో లేదో తాను నటించిన తాజా చిత్రం వీరే ది వెడ్డింగ్ ప్రమోషన్స్ లో బిజీ అయ్యింది. ఈ వీరే ది వెడ్డింగ్ సినిమా జూన్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాప్రమోషన్స్ ని ముగించేసుకుని సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో పాటుగా హానిమూన్ కి చెక్కేస్తుంది. పెళ్లి, కెరీర్ ని సమానంగా ప్రేమిస్తున్న సోనమ్ కపూర్ ఇప్పుడు భర్తతో కలిసి హనీమూన్ ట్రిప్ కి వెళ్లబోతుంది.

హనీమూన్ కోసం…

పెళ్ళైన పదినేను రోజులకు భర్త ఆనంద్ అహుజాతో కలిసి గ్రీస్ దేశం వెళ్లబోతున్నానని, ఇది హనీమూన్ ట్రిప్ అని చెప్పేసింది. మరి సోనమ్ కపూర్ ఇక తన భర్త తో కలసి కొన్నాళ్ళు అక్కడే ఉండి హానీమూన్ ట్రిప్ ముగించుకుని మళ్లీ తన పనుల్లో బిజీగా ఉంటుంది. మరి ఇలా సమంత, సోనమ్ కపూర్ లను చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. తారలు పెళ్లి వయసు రాగానే పెళ్లిళ్లు చేసుకుని కెరీర్ ని పాడు చేసుకోకుండా కాపాడుకోవడం అంటే కత్తి మీద సామే. అయినా సమంత, సోనమ్ లను చూస్తుంటే మాత్రం ఇది చాలా ఈజి అనిపిస్తుంది కదూ..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*