శ్రీను వారిని సెలెక్ట్ చేసి షాక్ ఇచ్చాడుగా!

Trolls on sreenu vaitla comments

వరుస డిజాస్టర్స్ లో ఉన్న శ్రీను వైట్ల లేటెస్ట్ గా రవితేజని ఒప్పించి ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి లేటెస్ట్ గా అను ఇమ్మాన్యూల్ తప్పుకోవడం ఒక షాక్ అయితే, వేరే హీరోయిన్స్ ను ఎంపిక చేసి మరో షాక్ ఇచ్చాడు శ్రీను. మొత్తానికి ఈ ఇద్దరి హీరోయిన్స్ ని ఒప్పించి ఆశ్చర్యపరిచాడు. వారే ఇలియానా, మరొక్కరు శృతిహాస‌న్‌.

దూరమైన వాళ్లను మళ్లీ…

నటి ఇలియానా టాలీవుడ్ ని వదిలి చాలా కాలం అయింది. అప్పుడెప్పుడో రవితేజతో ‘దేవుడు చేసిన మ‌నుషులు’ సినిమాలో క‌నిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసి ఇక్కడ హీరోలపై చాలా ఘాటు వ్యాఖ్య‌లే చేసింది. అటు శృతిహాస‌న్ కూడా సినిమా ఒప్పుకుని ఏడాది పైనే అవుతోంది. టాలీవుడ్ లో ప‌వ‌న్ కల్యాణ్ స‌ర‌స‌న ‘కాట‌మ‌రాయుడు’ త‌ర్వాత మ‌ళ్లీ ఏ సినిమా ఒప్పుకోలేదు శృతి. ఈ ఇద్ద‌రినీ ప‌ట్టుకొచ్చి త‌న సినిమాలో అవ‌కాశ‌మిస్తున్నాడు శ్రీ‌నువైట్ల‌.

అను ప్లేస్ లో ఎవరో….

ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభిన‌యం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్స్ కావాలంట. అందుకే వీరిని సెలెక్ట్ చేసాడు శ్రీను. మరి అను ప్లేస్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*