ఒక రిచ్ పెళ్లిని చూపించారుగా…!

దిల్ రాజు కి కథ నచ్చింది అంటే ఆ సినిమా ఖర్చు విషయంలో అస్సలు వెనుకాడడు. అయన కథను నమ్మి సినిమాలు చేస్తాడు. మధ్య మధ్యలో కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా వేస్తుంటాడు అది వేరే విషయం. మాములుగా దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రత్యేకమైన ఆసక్తితో ఉంటారు ప్రేక్షకులు. ప్రస్తుతం వచ్చే శుక్రవారం దిల్ రాజు బ్యానర్ నుండి నితిన్ – రాశి ఖన్నా జంటగా కుటుంబ కథ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా పోస్టర్ తోనే పిచ్చగా ఆకట్టుకున్న ఈ సినిమా పాటలు, టీజర్ అలాగే ప్రమోషన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ కూడా విడుదలైంది. మరి ఆ ట్రైలర్ చూస్తుంటే బాగా డబ్బున్న పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ఈ మధ్యన సామాజిక మాధ్యమాల్లో ట్రైలర్స్ వదులుతున్నారు పెళ్లి ఫోటో గ్రాఫేర్స్. అంత రిచ్ గా అందమైన పెళ్లిలా కనబడుతుంది శ్రీనివాసుడి కళ్యాణం.

ఖర్చుకు ఏమాత్రం వెనకాడని దిల్ రాజు

జయసుధ వాయిస్ ని బ్యాగ్రౌండ్ లో పెట్టి వదిలిన ఈ ట్రైలర్ లో ఒక సంపన్నుడి పెళ్లి ఎలా ఉంటుందో అలా వుంది. జీవితంలో పండగలు చాలానే వస్తాయి. కానీ జీవితంలో పెళ్లి వేడుక మాత్రం ఒక్కసారే వస్తుంది… అని చెప్పినట్టుగా భారీ హంగులతో ఆ పెళ్లి పందిరి కళ కళలాడుతుంది. పెళ్లంటే చుట్టాలు, ఆత్మీయులు ఇలా ఆ సందడి తలుచుకుంటేనే మన ఇంట్లో పెళ్లి వేడుకలు గుర్తొచ్చేస్తున్నాయి. పెళ్లి కోసం చేసే పిండి వంటల దగ్గర నుండి.. పెళ్లి పందిరి డెకరేషన్ వరకు, శుభలేఖలు దగ్గర నుండి.. వాటిని పంచే వరకు.. ఇక పెళ్లి కొడుకు తరుపు బంధువులను రిసీవ్ చేసుకోవడం.. వారికి మర్యాదలు చెయ్యడం.. పెళ్లి కొడుకుని ఆటపట్టించడం… అబ్బో ఇలాంటివి పెళ్లిల్లలో ఎంత కామనో శ్రీనివాస కళ్యాణం పెళ్లి వేడుకలో చూపించారు. ఇక నితిన్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్స్, రాశి ఖన్నా అందాలు… ఇలా ఆ శ్రీనివాసుడి కల్యాణానికి భారీ హంగులు. ఓవరాల్ గా ఈ శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ చూస్తుంటే మాత్రం నిజంగానే ఒక రిచ్ పెళ్లి ట్రైలర్ ని చూసినట్లుగా అనిపిస్తుంది.

హిట్ సంకేతాలు ఇచ్చిన సెన్సార్ బృందం

ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, దర్శకుడి మేకింగ్ స్టయిల్, నిర్మాణ విలువలు సినిమాకి అదనపు హంగులనే అనిపిస్తున్నాయి. ఇక వచ్చే శుక్రవారం శ్రీనివాస కళ్యాణం సోలోగా బాక్సాఫిస్ బరిలోకి దిగబోతుంది. మరి ఈ సినిమా హిట్ అంటూ పక్కా సంకేతాలు కూడా సెన్సార్ వారు ఇచ్చేసారు. మరి గ్రాండ్ పెళ్ళికి క్లీన్ యూ అనే క్లిన్ సర్టిఫికెట్ ఇచ్చేసి సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*