శ్రీనివాసుడి కళ్యాణ గీతాలు

నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలను ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ఆవిష్కరించారు. పెళ్లి విశిష్టతను తెలియజెప్పే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుకను పెళ్లి వేదికను తలపించేలా డిజైన్ చేయడం నటీనటులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది.

టాప్ 3 లో ఒకటవుతుంది…

హీరో నితిన్ మాట్లాడుతూ…”నా జీవితంలో బ్యూటిఫుల్ మెమొరీ ఈ సినిమా. 70మందితో నేను యాక్ట్ చేయాలంటే కొన్నిసార్లు భయం వేసేది. ‘కళ్యాణం వైభోగం’ పాట అయితే ఇకపై ప్రతి పెళ్లిలో వినిపిస్తుంది. నా సినిమాల్లో నాకు నచ్చిన ఆల్ టైమ్ ఫెవరెట్స్‌ లో టాప్ 3లో తప్పకుండా ఉంటుంది. సతీష్ వేగేశ్న ఈ సినిమా కథ రాసి, అందులో నన్ను హీరోగా అనుకోవడం నా అదృష్టం. క్లైమాక్స్ సీన్లలో ఆయన రాసిన డైలాగులకు నా దిల్ ఖుషీ అయ్యింది.” అన్నారు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సతీష్ వేగేశ్న, హీరోయిన్ రాశీ ఖన్నా, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్, నటీనటులు ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, జయసుధ, సీనియర్ నరేష్, ఆమని, సితార, గాయని సునీత, హీరోయిన్లు నందితా శ్వేత, పూనమ్ కౌర్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి తదితరులు ఈ పాటల వేడుకలో పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*