శ్రీనివాసుడి మొదటి వారం కలెక్షన్స్..!

నితిన్ – రాశి ఖన్నా జంటగా.. దిల్ రాజు బ్యానర్ లో సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన శ్రీనివాస కళ్యాణం సినిమా విడుదలై వారం కావొస్తుంది. విడుదలైన మొదటి షోకే యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి మాత్రమే తిరిగొచ్చేలా కనబడుతుంది. సినిమాలో అనుకున్నంత కంటెంట్ లేకపోవడం.. సినిమా మొత్తం ఏదో క్లాస్ తీసుకున్నట్టుగా ఉండడం.. పెళ్లి పేరుతొ అన్ని తతంగాలు గుర్తు చేసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా శ్రీనివాస కళ్యాణం సినిమాని రిజెక్ట్ చేశారు. ఇక వారం రోజుల్లో కేవలం 11 కోట్ల పై మేర షేర్ ని రాబట్టింది ఈ సినిమా. మరి తాజాగా విడుదలైన గీత గోవిందం సినిమా ముందు శ్రీనివాస కళ్యాణం సినిమా చేతులెయ్యడం ఖాయంగానే కనబడుతుంది. ఇకపోతే శ్రీనివాస కళ్యాణం మొదటి వారం ప్రపంచవ్యాప్త కలెక్షన్స్…

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 4.75
సీడెడ్ 1.42
నెల్లూరు 0.32
కృష్ణ 0.61
గుంటూరు 0.75
వైజాగ్ 1.30
ఈస్ట్ గోదావరి 0.72
వెస్ట్ గోదావరి 0.46
టోటల్ ఏపీ అండ్ టీఎస్ షేర్ 10.33 కోట్లు
ఓవర్సీస్ 0.80
ఇతర ప్రాంతాలు 0.70
మొత్తం ప్రపంచవ్యాప్త షేర్ 11.83 కోట్లు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*