క్లైమాక్స్‌ సీన్‌ తో కిక్ ఇస్తాడంట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా’ అన్న డైలాగ్ ప్రస్తుతం వచ్చిన సినిమాలకి వర్తిస్తుంది. సినిమా మొత్తం ఎన్ని తప్పులు ఉన్నా లాస్ట్ క్లైమాక్స్ లో కిక్ ఇచ్చే అంశం ఉంటే ప్రేక్షకులు ఆ తప్పులన్నీ క్షమించేస్తారు. ఇలా చాలా సినిమాల విషయంలో జరిగింది. అలానే ఈ వారం రిలీజ్ అయ్యే సినిమా క్లైమాక్స్ కూడా కిక్ ఇస్తుందంట.

ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేమకథే..

నితిన్ – రాశి ఖన్నా హీరో హీరోయిన్స్ గా వస్తున్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా క్లైమాక్స్ చూసిన ప్రతి ప్రేక్షకుడికి కిక్ ఇస్తుందట. లేటెస్ట్ ఈ సినిమాను యూనిట్ సభ్యులతో పాటు కొంతమంది బయట వాళ్లకి కూడా చూపించారంట నిర్మాత దిల్ రాజు. ఫస్ట్ హాఫ్ మొత్తం నితిన్ – రాశి ఖన్నా మధ్య నడిచే ప్రేమకథే ఉంటుందని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం టైటిల్ కి న్యాయం జరిగేలా పెళ్లి తంతు వగైరా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్తున్నారు.

క్లైమాక్స్ హైలెట్ అంట..!

చివర క్లైమాక్స్ లో వచ్చే సీన్స్… నితిన్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులని హత్తుకుంటాయి అని చెబుతున్నారు చూసిన వారు. ఓవరాల్ గా సినిమా బాగుందని టాక్. నితిన్ లో కొత్త కోణం చూస్తారని.. రాశి ఖన్నా బాగా చేసిందని అంటున్నారు. నితిన్ కు ఈ సినిమా తన కెరీర్ బెస్ట్ అవుతుందని చెబుతున్న మాట. మొదటి నుండి ఈ సినిమాపై దిల్ రాజు హోప్స్ పెట్టుకున్నాడు. చూద్దాం మరి ఈ సినిమా ఎంతవరకు బాగుంటదో..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*