శ్రీను వైట్ల బ్యాడ్ లక్ కి రవితేజ తోడయ్యాడు..!

Sreenu Vaitla plan on remunaration failed

ఒక్కప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఒక్కడిగా ఉండేవాడు శ్రీను వైట్ల. అతనితో సినిమా చేయడానికి చాలా మంది పెద్ద స్టార్స్ తహతహలాడేవాళ్లు. కానీ గత కొన్నేళ్ల నుండి వరసబెట్టి ఒకే ఫార్ములా సినిమాలు తీయడంతో తన కెరీర్‌ను పాడు చేసుకున్నాడు వైట్ల. కేవలం మూడే మూడు సినిమాలు అతని కెరీర్‌ను నాశనం చేసాయి.

ఉన్న కష్టాలు చాలవన్నట్లు…

‘మిస్టర్’ సినిమా తర్వాత అతనితో ఏ హీరో చేయడానికి ముందుకు రాలేదు. లాస్ట్ కి అతని స్నేహితుడు రవితేజ కరుణించి సినిమా ఇప్పించాడు. అది కూడా మైత్రి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ లో. దీంతో ఎలాగైనా ఈసారి కచ్చితంగా హిట్ కొట్టి తను ఏంటో నిరూపించుకోవాలని ట్రై చేస్తుంటే వైట్లకు ఉన్న కష్టాలు చాలవని, ఈ సినిమా మొదలయ్యే ముందు వరకు పర్వాలేదనిపించే స్థితిలో ఉన్న రవితేజ సైతం ఇప్పుడు దారుణమైన ట్రాక్ రికార్డుతో తయారయ్యాడు.

ఈసారైనా మారేనా..?

రవితేజ గత రెండు చిత్రాలు ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’ సినిమాలు జనాలలో నెగటివ్ మార్క్ పడిపోయింది. రవితేజ ఇప్పుడు చేసే శ్రీను వైట్ల సినిమా కూడా ఇలానే రొటీన్ గా ఉంటె ఇంకా అతని సినిమాలు చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. సో ‘అమర్ ఆంటోనీ అక్బర్’ సినిమాతో ఏమన్నా కొత్తగా చూపిస్తే తప్ప ఆ మార్క్ తొలిగే అవకాశం లేదు. కానీ శ్రీను వైట్ల మీద నమ్మకం లేదు. ‘ఆగడు’, ‘బ్రూస్ లీ’ లాంటి పెద్ద డిజాస్టర్లు ఎదురైనప్పటికీ మళ్లీ ‘మిస్టర్’ లాంటి రొటీన్ సినిమానే చేశాడు. చూద్దాం ఏమన్నా మిరాకిల్ జరిగి సినిమా హిట్ అవచ్చేమో?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*