కొడుకు చేతిలో దెబ్బలు తిన్న స్టార్ హీరో..?

tamil films promotions in telugu

పై టైటిల్ చూసి ఏదేదో ఊహించేసుకోకండి. ఇప్పుడు మీరు చూడబోయే న్యూస్ అండ్ టైటిల్ కూడా జస్ట్ ఫన్ కోసమేనండి. ఇంతకీ కొడుకు చేతిలో తన్నులు తిన్న ఆ స్టార్ హీరో ఎవరు… ఆ కథ కమామిషు ఏమిటనేగా మీ ఆరాటం. అక్కడికే వస్తున్నాం… అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ లో విరామం లేకుండా గడుపుతున్న జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ చేతిలో పిడి గుద్దులు తిన్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్ ని ఆఘమేఘాల మీద జరిపేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్… కాస్త సమయం దొరికినా ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారు. అందులోనూ ఇప్పుడు చిన్న కొడుకు తో ఎన్టీఆర్ తెగ ఆడేసుకుంటున్నాడు. ఇకపోతే నిన్న సండే సందర్భంగా ఎన్టీఆర్ ఇంట్లోనే తన కొడుకుతో తెగ ఎంజాయ్ చేసాడు

పంచింగ్ టైం అని పోస్ట్ చేసిన ఎన్టీఆర్

కొడుకు అభయ్ రామ్ కిచెన్ లో గట్టు మీద కూర్చుని ఉండగా.. ఎన్టీఆర్ కింద కొడుకు ఎదురుగా కూర్చోగా .. అభయ్ రామ్ తన తండ్రి ఎన్టీఆర్ మొహం మీద బాక్సింగ్ చేసేసాడు. రెండు చేతులతో ఎన్టీఆర్ మొహం మీద గుద్దుతూ ఆడేసుకున్నాడు. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియా పేజీ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. నా కొడుకు అభయ్ రామ్ పంచింగ్ టైం అంటూ ఎన్టీఆర్ ని అభయ్ కొడుతున్న ఆ ఫన్నీ వీడియో ని పోస్ట్ చేసాడు. మరి పెద్ద స్టార్ అయ్యుండి ఇలా కొడుకు చేతిలో తన్నులు తింటున్నాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ కూడా తన పిల్లల్తో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తూ ఆ విషయాన్నీ సోషల్ మీడియా తో పంచుకుంటాడు. ఇక మహేష్ అయితే చెప్పక్కర్లేదు. మహేష్ కంప్లీట్ ఫామిలీ మ్యాన్. వీలు చిక్కినప్పుడల్లా… గౌతమ్, సితారాలతో మహేష్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ… ఫారిన్ టూర్స్ వేస్తుంటాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*