స్టార్ హీరోలంతా అదే ప‌ని చేస్తున్నారా..?

tamil films promotions in telugu

టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు తమ బాడీ షేప్ ని మార్చేస్తున్నారు. జై లవ కుశ లో బాగా లావుగా కనబడిన ఎన్టీఆర్ అరవింద సమేత కోసం దాదాపుగా మూడు నెలల పాటు బాలీవుడ్ ట్రైనర్ ఆధ్వర్యంలో జిమ్ లో కష్టపడి కండలు కరిగిస్తున్నాడు అనుకుంటే.. అరవింద సమేత ఫస్ట్ లుక్ లో సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టాడు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ జిమ్ లో చేసిన వర్కౌట్స్ వీడియోలు అన్ని ఇంటర్నెట్ లో హల్ చ‌ల్‌ చేశాయి. ఇక రంగస్థలం సినిమా కోసం పల్లటూరి చిట్టి బాబు గెటప్ కోసం రామ్ చరణ్ బాడీ ని కండలు పెంచి రఫ్ గా తయారు చేసాడు. ఇక అచ్చం పల్లెటూరి మొరటోడు గెటప్లో రామ్ చరణ్ లుక్ సూపర్. అయితే బోయపాటి తో సినిమా కోసం ఆ కండలు కరిగించే పని పెట్టుకున్నాడు రామ్ చరణ్. బోయపాటి సినిమాలో రామ్ చరణ్ మంచి బాడీ షేప్ తో ఉంటాడని అతడి ప్రస్తుత లుక్ తెలియజేస్తుంది.

అంద‌రూ అదే బాట‌లో…

ఇక బాహుబలితో ప్రభాస్ పెంచిన కండలు.. గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి మహారాజు గెటప్ లో ప్రభాస్ మంచి బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టాడు. ఇక సాహో కోసం కొద్దిగా బాహుబలి కండలను అమెరికా ట్రైనర్ సహాయంతో కరిగించి సాహో కోసం సిద్దమయ్యాడు. అలాగే అల్లు అర్జున్ ఎప్పుడూ ఫిట్ గా ఉండడానికి తెగ ట్రై చేస్తాడు. నా పేరు సూర్య లో ఆర్మీ ఆఫీసర్ లుక్ కోసం అల్లు అర్జున్ బాలీవుడ్ ట్రైనర్ ని తెచ్చుకున్నాడు. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి మహేష్ బాబు వచ్చి చేరాడు. మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ 25 మూవీ కోసం లుక్ తో పాటుగా బాడీ షేప్ ని కూడా మార్చేస్తున్నాడు.

ట్రైన‌ర్ తో ఫోటో…

ఆ సినిమాలో స్టూడెంట్ లుక్ లో మహేష్ పర్ఫెక్ట్ ఫిట్ నెస్‌ కోసం ట్రై చేస్తున్నాడట. ఇప్పటికే తన టోటల్ లుక్ మార్చేసిన మహేష్ ఫిట్ నెస్‌ విషయంలోనూ సీరియస్ గా వున్నాడట. ఇప్పటికే మహేష్ తన ఫిట్‌ నెస్ ని మొదలు పెట్టేసాడని… అవుట్ డోర్ లొకేషన్స్ లో కూడా ట్రైనర్ తో పనిచేస్తూ త్వరలోనే ఫుల్ ఫిట్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నాడట. ఫిట్ నెస్ ట్రైనర్ తో ఉన్న ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు మహేష్. మరి మహేష్ ఫుల్ ఫిట్ నెస్ తో స్టూడెంట్ లా తన 25 వ మూవీ లో అదరగొట్టేయ్యనున్నాడన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*