అందరిని దోచేసేలా కనబడుతుందే!!

‘సమ్మోహనం’ సినిమాతో హిట్ అందుకున్న మహేష్ బాబు బావ సుధీర్ బాబు ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ లో ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమా లో హీరో గా చేస్తున్నాడు. ఆర్ఎస్ నాయుడు అనే కొత్త దర్శకుడితో సుధీర్ బాబు ఈ సినిమాని చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ తో కలిసి ‘సమ్మోహనం’ సినిమా చేసిన సుధీర్ బాబు ఆ సినిమాలో సినిమాలంటే పడని కుర్రాడు.. ఆఖరుకి సినిమా హీరోయిన్ నే లవ్ చెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని సన్నివేశాల్లోను సుధీర్ బాబు పెరఫార్మన్స్ ఆ సినిమాలో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాలో కొత్తమ్మాయి నభా నటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అయితే తాజాగా విడుదలైన ‘నన్ను దోచుకుందువటే’ టీజర్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది.

కోపిష్టిగా….

ఇక ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో సుధీర్ బాబు ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనబడుతున్నాడు. అందునా కోపిష్టి మేనేజర్ గా ఆఫీస్ అంతటిని గడగడలాడించే మేనేజర్ గా సుధీర్ బాబు కోపిష్టి లుక్స్ చాలా అంటే చాల బావున్నాయి. ఇక ఆఫీస్ లో స్టాఫ్ మొత్తం సుధీర్ వస్తున్నాడు అంటేనే గజగజ వణికిపోతూ తమ సీట్ల లో పని చేసుకుంటుంటారు. ఇక హీరోయిన్ మాత్రం నా పేరు సిరి నేను సాఫ్ట్ వెర్ ఉద్యోగిని అంటూ పదే పదే చెబుతూ.. ఒక సిల్లీ పాత్రని చేస్తుంది. మరి సుధీర్ బాబు కోపిష్టిగా.. నభా నటేష్ చాలా కామెడీ పాత్రలో నటిస్తున్నారు. ఇక వేణు, వైవా హర్షలు కమేడియన్ లుగా నాజర్ మాత్రం సీరియస్ తండ్రి పాత్ర లో కనిపిస్తున్న ఈ టీజర్ చూస్తుంటే నన్ను కాదు.. అందరి మనసులను దోచేస్తుందని క్లాస్ ఫీలింగ్ తెప్పిస్తుంది.

టీజర్ లోనే….

మరి దర్శకుడు కొత్తవాడైనా ఈ సినిమా టేకింగ్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడో అనేది ఈ టీజర్ లోనే అర్ధమవుతుంది. ట్రెడిషనల్ గా సిల్లీగా హీరోయిన్ పాత్రను డిజైన్ చేసిన దర్శకుడు చాలా కోపముగా, సీరియస్ లుక్స్ తో కనబడుతూ తన పని తానూ చేసుకుంటూ అందరిని హడలుగొట్టే పాత్రని సుధీర్ బాబు కి తీర్చిదిద్దామని, చూడడానికి బావున్నాయనే అనిపిస్తుందని చెబుతున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇక ఈసినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*