అంత‌లోపు బాలీవుడ్ సినిమా తీసేస్తే

‘రంగస్థలం’ సినిమాతో తాను కూడా క్లాస్ తో పాటు మాస్ ప్రేక్షకులని కూడా మెప్పించగలన‌ని నిరూపించుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. ‘రంగస్థలం’ ముందు వరకు ప్రేక్షకుల మైండ్ కి పదును పెట్టి.. అర్ధం అయ్యి అర్ధం కానీ స్క్రీన్ ప్లే తో అయోమ‌యం చేసి జయాపజయాలను సరిసమానంగా అందుకున్న సుక్కు.. రామ్ చరణ్ తో సినిమా చేసి మాస్, క్లాస్ జనాలని మెప్పించగలనని వసూళ్ల‌ రూపంలో నిరూపించేసాడు.

ఇప్ప‌టికే ప్ర‌క‌టించినా..

అందుకే మహేష్ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా సుక్కు తో సినిమా ఒకే చేసేసాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ కమర్షియల్ గా ఫెయిల్ అయినప్పటికీ క్రిటిక్స్ పాయింట్ అఫ్ వ్యూ లో సక్సెస్ అందుకుంది. అయితే మహేష్ కు ప‌ర్‌ఫార్మెన్స్ పరంగా అది ఎప్పటికీ స్పెషల్ మూవీనే. మహేష్ 25వ చిత్రం తర్వాత సుకుమార్ తో మూవీ ఉంటుందని మహేష్ గతంలోనే చెప్పాడు. అయితే తాజా అప్ డేట్ ప్రకారం మహేష్ – సుకుమార్ సినిమా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

అంత‌లోపు బాలీవుడ్ సినిమా…

ఎంత‌లేదన్నా మహేష్ – వంశీ సినిమా కంప్లీట్ అవ్వడానికి కనీసం 9 నెలలు పడుతుంది. ఈ లోపల సుక్కు బాలీవుడ్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని ఇన్సైడ్ టాక్. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా ఒక సినిమా చేయాలనుకుంటున్నాడని సమాచారం. మహేష్ కు సుక్కు ఈసారి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రెయిట్ నేరేషన్ తో కమర్షియల్ లైన్ వినిపించాడని సమాచారం. ఆ లైన్ కు మహేష్ ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. అయితే పూర్తి స్క్రిప్ట్ కు సమయం పడుతుంది కాబట్టి ఈలోపు బాలీవుడ్ డెబ్యూ చేసేద్దామని సుకుమార్ ప్లాన్ అంట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికార ప్రకటన కోసం వెయిట్ చేయక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*