సుకుమార్ – మహేష్ షాకింగ్ బడ్జెట్!

mahesh babu film with shahid kapoor

‘మహర్షి’ తర్వాత మహేష్ సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ 26వ చిత్రంగా వస్తున్న ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇది ప్రేక్షకుల మెదళ్లకు పదునే పెట్టె సినిమా కాదని ‘రంగస్థలం’లా కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బాస్టర్ అందించిన మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇది మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ గా తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.

హాలీవుడ్ టెక్నీషియన్స్ తో…

ఈ సినిమాను ఏకంగా 150కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ను రంగంలోకి దించుతున్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నారు మేకర్స్. మరి ఇంత బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అంతలా వసూల్ చేయాలంటే ఇండస్ట్రీ హిట్ అయితే తప్ప వసూల్ చేయలేడు. మరి సుకుమార్ కి స్టోరీ పైన అంత కాన్ఫిడెన్సా? చూద్దాం ఏం అవుతుందో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*