పందెం లో పది లక్షలు గెలుచుకున్న డైరెక్టర్?

ఒక సినిమా తీస్తున్నప్పుడు కథానుసారంగా సినిమాల్లో హీరో హీరోయిన్స్ కి మధ్యన ముద్దు సీన్స్ ఉంటే… వాటిని చెయ్యడానికి హీరోయిన్స్ కి మొహమాటముండాలి కానీ…. ఇక్కడ డైరెక్టర్ మొహమాట పడ్డాడు. ఒకవేళ హీరోయిన్స్ అన్నిటికి సిద్ధమంటూ లిప్ లాక్ కి సై అంటే.. ఓకె కానీ…. హీరోయిన్స్ ని లిప్ లాక్ కిస్ ల కోసం బ్రతిమిలాడి ఒప్పించాలంటే వారికీ ఎక్కువ పారితోషకం నిర్మాతలు సమర్పించుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఒక డైరెక్టర్ గారు హీరోకి హీరోయిన్ కి మధ్యన ముద్దు సీన్ తీసేందుకు తడబడుతుంటే…. ఆ సినిమా నిర్మాత “ఆ సీన్ తియ్యడం నీవల్ల కాదు కావాలంటే పది లక్షల పందెం అన్నాడట”. దానికి ఆ డైరెక్టర్ ముందు కాస్త మొహమాట పడ్డా కూడా ఆ ముద్దు సీన్ ని అనుకున్నది అనుకున్నట్టుగా తీసి పది లక్షలు గెలిచేసాడట.

ఇంతకీ ఆ పది లక్షల పందెం కథా కమామిషు ఏమిటంటే… సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలంలో రామ్ చరణ్ కి చెవుడు. మరి హీరోయిన్ సమంత చెప్పేది రామ్ చరణ్ కి వినబడదు. కానీ ఆ ప్రేమను అద్భుతంగా ఎక్స్ప్రెస్ చెయ్యాలి. రామలక్ష్మి…. చిట్టిబాబు నువ్వుంటే నాకిష్టమని చెబుతున్నప్పుడు…. అక్కడికొచ్చిన పోలీస్ లు చిట్టిబాబుని అరెస్ట్ చేసినప్పుడు వారి మధ్య ప్రేమ ఎక్సపోజ్ కావాలి. అలాంటప్పుడు ముద్దు తప్ప వేరే మార్గం లేదు. అందుకే చెర్రీకి సామ్ కి అక్కడ ముద్దు సీన్ పెట్టిన సుక్కు… ఆ సీన్ ని చేయడానికి దాదాపుగా రెండు రోజుల టైం తీసుకున్నా ఆ సీన్ అనుకున్నట్టుగా రావడం లేదట.

అయితే ఆ ముద్దు సీన్ చెయ్యడం నీ వల్ల కాదు… ఒకవేళ ఆ సీన్ కరెక్ట్ గా తీస్తే పది లక్షలు ఇస్తానన్నాడు రంగస్థలం నిర్మాత… ఆ దెబ్బకి ఆ సీన్ నేనొక ఛాలెంజ్ గా తీసుకుని కేవలం అంటే కేవలం అరగంటలో ఆ ముద్దు సీన్ చేసి ఒకే చెప్పించాను. అలా నేను పది లక్షలు అందుకున్నాని సుకుమార్ చెబుతున్నాడు. అయితే ఆ సీన్ అంతబాగా రావడానికి కారణం తనతో పనిచేసిన నలుగురు రచయితలని చెప్పిన సుక్కు.. ఆ పది లక్షలను వారికే ఇచ్చేశాడట. మరి రంగస్థలంలో ఆ ముద్దు సీన్ ఉంటుందని రామ్ చరణ్ కి కూడా తెలియదట. ఆ సీన్ గురించి కేవలం సమంత కి మాత్రమే చెప్పి చరణ్ కి చెప్పకుండా దాయబట్టే… ఆ సీన్ అంతబాగా పండిందని చెబుతున్నాడు ఈ లెక్కల మాష్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*