ఏఎన్నార్ లుక్ లో సుమంత్ కూడా

ఎన్టీఆర్ బయో పిక్ షూటింగ్ ఏ రేంజ్ లో జరుపుకుంటుందో అదే రేంజ్ లో ఎన్టీఆర్ బయో పిక్ మీద ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ క్రేజుంది. ఎన్టీఆర్ బయో పిక్ విషయంలో బాలకృష్ణ కూడా దేనికి తగ్గడం లేదు. బడ్జెట్ ఎంత కావాలన్నా పెట్టడానికి సహా నిర్మాతలతో కలిసి రెడీగా వున్నాడు బాలయ్య. తండ్రి గారి పాత్రలో బాలయ్య లుక్ ఇప్పటికే అదరగొట్టేసాడు. ఇక చంద్రబాబు లుక్ లో రానా కూడా ఇరగదీసాడు. చంద్రబాబు గా అదే లుక్ లో రానా, ఎన్టీఆర్ లుక్ లో బాలయ్య పాత్రలు చూస్తే దర్శకుడు క్రిష్ పాత్ర‌ధారుల ఎంపిక‌, వాళ్ల మేకొవ‌ర్‌ల‌పై ఎంత శ్రద్ద తీసుకుంటున్నాడో స్పష్టంగా అర్ధమవుతుంది.

ఇప్పుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర మీద ఎంత ఆసక్తి ఉందొ..ఇపుడు ఆ సినిమా లో చేస్తున్న నటీనటుల పాత్రల మేకోవర్ మీద కూడా అంతే ఆసక్తి ఏర్పడింది. తాజాగా ఏఎన్నార్ పుట్టిన రోజు కానుకగా ఎన్టీఆర్ నట జీవితంలో కీలక పాత్ర పోషించిన ఏఎన్నార్ లుక్ బయటికొచ్చింది. ఏఎన్నార్ గా ఎన్టీఆర్ బయో పిక్ లో ఏఎన్నార్ కూతురు కొడుకు సుమంత్ నటిస్తున్నాడు. ఇక ఏఎన్నార్ లుక్ లో సుమంత్ అచ్చంగా నాగేశ్వర రావు నే తలపిస్తున్నాడు. మామూలుగానే సుమంత్‌లో అక్కినేని పోలిక‌లు కొన్ని క‌నిపిస్తాయి. అందులో సుమంత్ అచ్చుగుద్దిన‌ట్టు తాత‌య్య‌ని ఈ లోక్ లో దింపేశాడు. అక్కినేని పోజుల్లో చాలా ప్ర‌సిద్ది పొందిన ఫోజుని క్రిష్ ఎంత బాగా చూపించాడో ఏఎన్నార్ లుక్ లో సుమంత్ ని చూస్తుంటేనే తెలుస్తుంది.

ఇక ఏఎన్నార్ లుక్ ఇలా ఉంటే.. సాయంత్రం మరో ఎన్టీఆర్ బయో పిక్ కి సంబందించిన లుక్ బయటికి రాబోతుంది. అందులో అక్కినేని, ఎన్టీఆరూ ఇద్ద‌రూ ఉంటారట. మరి చంద్రబాబు లుక్ లో రానా ని వదలిన తరవాత మామా అల్లుళ్ళ గా రానా అండ్ బాలయ్య లుక్ కి కూడా విశేష ఆదరణ లభించింది. ఇక స్నేహితులైన ఏఎన్నార్, ఎన్టీఆర్ లు కలిసి ఉన్న మరో లుక్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో సాయంత్రానికల్లా తెలుస్తుంది. ఇకపోతే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయో పిక్ వచ్చే సంక్రాతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చేసే ఉద్దేశ్యంతో.. దర్శకుడు క్రిష్ అసలు విరామమే తీసుకోకుండా ఎన్టీఆర్ షూటింగ్ ని జరిపిస్తున్నాడు. మరి బాలయ్య కూడా క్రిష్ కి తగిన సహకారం అందించబట్టే సినిమా షూటింగ్ అనుకున్న టైం కి పూర్తయ్యేలా కనబడుతుంది. ఇక ఎన్టీఆర్ బయో పిక్ క్రేజ్ ఆ ప్రి రిలీజ్ బిజినెస్ గురించి బయట జరుగుతున్నా ప్రచారంతో మరిన్ని అంచనాలు పెరిగిపోయేలా కనబడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*