ఇలా అయితే సునీల్ కి కష్టమేనా..?

pruthvi comments on sunil telugu news

కమెడియన్ గా ఒద్దుగా బొద్దుగా కనబడిన సునీల్ హీరో అయ్యాక కాస్త స్లిమ్ అయ్యాడు. హీరోగా మారాక వర్కౌట్స్ గట్రా చేసి బాడీ షేప్ ని మార్చేశాడు. పూలరంగడు సినిమా కోసం సునీల్ ఏకంగా సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేసాడు. అయితే హీరోగా అవకాశాలు సన్నగిల్లాక.. సునీల్ బాడీ లో చాలా తేడా వచ్చింది. కృష్ణాష్టమి ఫెయిల్యూర్ తో సునీల్ బరువు పెరగడం స్టార్ట్ చేసాడు. తాజాగా సునీల్ హీరో నుండి మళ్లీ కమెడియన్ గా టర్న్ తీసుకున్నప్పటికీ.. మొదట్లో కమెడియన్ గా ఉన్న సునీల్ ఎలా వుండేవాడో మొదట్లో ఉన్నట్లుగానే లావుగా తయారయ్యాడు. నిన్నగాక మొన్న సునీల్ హీరోగా విడుదలైన సిల్లీ ఫెలోస్ లో సునీల్ బాగా లావుగా హీరో లా కాకుండా కమెడియన్ లాగే కనబడ్డాడు.

డ్యాన్సులు చేయలేక…

కమెడియన్ గా లావుగా ఉన్నప్పటికీ… సునీల్ ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తోనూ, అలాగే బోడి లాంగ్వేజ్ తోనూ కామెడీ పండించేవాడు. సిల్లీ ఫెలోస్ లో కూడా బాగానే కామెడీ చేసాడు కానీ… మ‌రీ లావైపోయాడు. క‌నీసం క‌ద‌ల‌డానికి సైతం ఇబ్బంది ప‌డుతున్నాడు. సిల్లీ ఫెలోస్ లోని ఒక పాట‌లో అయితే.. అస‌లేమాత్రం స్టెప్పులు వేయ‌లేక‌పోయాడు. క‌మెడియ‌న్ గా సునీల్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలున్నాయి. అన్నిటిలో ప్రస్తుతం సునీల్ చేతిలో ఉన్న ముఖ్యమైన సినిమాల్లో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న అర‌వింద స‌మేత‌, రవితేజ -శ్రీను వైట్ల కాంబోలో తెరెక్కుతున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాలు ఉన్నాయి.

కమెడియన్ గా నవ్విస్తాడా..?

మరి ఒక పక్క హీరోగా ట్రై చేస్తూనే ఉన్న సునీల్ ఇలా కమెడియన్ పాత్రల కోసం బరువు పెరిగితే ఇక హీరో అవకాశాలు రావడం కష్టం. అలాగే మరీ బరువు పెరగడం వలన కమెడియన్ గా కూడా సునీల్ కి కష్టకాలం రావొచ్చు. ప్రస్తుతం సునీల్ ఈ చేతిలో ఉన్న రెండు పెద్ద సినిమాల్లోనూ దాదాపు ఫుల్ లెంగ్త్ పాత్ర‌లే పోషిస్తున్నాడు. ఇక ఇదే బాడీతో అర‌వింద స‌మేత‌లో సునీల్ ఏమాత్రం న‌వ్విస్తాడ‌న్నది మాత్రం కాస్త అనుమానమే. మరి సునీల్ కామెడీని చూడాలంటె మాత్రం అక్టోబర్ 12 వరకు ఆగాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*