మరి శ్రీను ఏం చేస్తాడో

Sreenu Vaitla film with manchu vishnu

ప్రస్తుతం హీరో సునీల్ మళ్ళీ తన పాత కమెడియన్ పాత్రలోకి మారిపోయాడు. హీరో హీరో అంటూ కమేడియన్ పాత్రలను గాలికొదిలేసిన సునీల్ ప్రస్తుతం మళ్ళీ కమేడియన్ గా బిజీ కావాలనుకుంటున్నాడు . ఇప్పటికే అరవింద సమేత లోను, శ్రీను వైట్ల అమర్ అక్బర్ ఆంటోని సినిమాల్లో సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక త్రివిక్రమ్ అరవింద సమేతలో కాస్త అటు ఇటుగా కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కనబడనున్న సునీల్… శ్రీను వైట్ల సినిమా లో మాత్రం కమెడియన్ గానే కనబడతాడట. అయితే శ్రీను వైట్ల సినిమాల్లో కమేడియన్ గా సునీల్ కి సక్సెస్ ఫుల్ రికార్డ్ ఉంది. రెడీ, దుబాయ్ శీను, ఢీ సినిమాల్లో సునీల్ కమెడియన్ గా 100 కి 100 మార్కులు కొట్టేసాడు.

అయితే హీరోగా ఇండస్ట్రీని పట్టుకుని వేళ్ళాడిన సునీల్ కి ఇక హీరో పాత్రలైతే రావడం లేదు. అందుకే తొందరగా తెలివితెచ్చుకుని కమెడియన్ గా అయితే మారాడు గాని… హీరోగా ఉన్న తన కామెడీని ఎవరు చూస్తారనే ఫీల్ లో సునీల్ ఉన్నాడంటున్నారు. మరి హీరోగా సీరియస్ గా హుందాగా ఉన్న తన ఫేస్ లో కామెడీని ని మిస్ చేసుకున్నాడు. ఇప్పుడిక తన ఫేస్ లో కేవలం కామెడీనే పలికించాలి. మరి ఎప్పుడో మరిచిపోయిన తన కామెడీని ఇప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారా అనే డౌట్ కూడా ఉందట. ఇక ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న శ్రీను వైట్ల తన పాత్రకి మంచి కామెడీ ట్రాక్ ఇచ్చాడని… ఒకవేళ శ్రీను వైట్ల సినిమాలో కామెడీ వర్కౌట్ అయ్యి మళ్ళీ కమేడియన్ గా బిజీ అవ్వాలనే ఆశతో ఉన్నాడట సునీల్.

మరి ప్రస్తుతం ప్లాప్స్ వెంటాడుతున్న శ్రీను వైట్ల, సునీల్ కేరెక్టర్ ని ఎంత కామెడీగా మలిచాడో తెలియదు గాని.. సునీల్ కి మంచి కామెడీ పాత్ర ఇచ్చినప్పటికీ సినిమా ఫలితం తేడా కొడితే సునీల్ మళ్ళీ ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక కమేడియన్ కాపోతే మరొకరు అన్నట్టుగా వుంది టాలీవుడ్ ఇండస్ట్రీ వ్యవహారం. ఇక సొంతం, ఢీ వంటి సినిమాల్లో చూసిన సునీల్ ని మళ్ళీ చూస్తామా లేదా అనేది మాత్రం అమర్ అక్బర్ ఆంటోని సినిమానే నిర్ణయిస్తుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*