హీరో గారి రెమ్యునరేషన్ పడిపోయిందే..!

కమెడియన్ కమ్ హీరో సునీల్ ప్రస్తుతం అటు హీరోగా ఇటు కమెడియన్ గా మళ్లీ దున్నేయ్యడానికి ఫుల్ గా ప్రిపేర్ అయిపోతున్నాడు. హీరోగా వరస ఎదురుదెబ్బలు తిన్న సునీల్ మళ్లీ కమెడియన్ గా మారటమే కాదు.. అవకాశాలు వస్తే హీరోగానూ చెయ్యాలనే కసితో ఉన్నాడిప్పుడు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఉన్న సునీల్ మధ్యలో హీరోగా మారాడు. కెరీర్ లో హీరోగా మూడు నాలుగు సినిమాలు చెప్పుకోదగ్గవిగా ఉన్నప్పటికీ…. హీరోగానే కెరీర్ కంటిన్యు చెయ్యాలనుకున్నాడు. కానీ హీరోగా అవకాశాలు తగ్గుతున్నాయని భావించిన సునీల్ తెలివిగా మళ్లీ స్నేహితుల ద్వారా కమెడియన్ గా మారిపోతున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ తో కలిసి కామెడీ డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో సిల్లీ ఫెలోస్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

భారీగా పడిపోయిన పారితోషకం..?

అయితే ఆ సిల్లీ ఫెలోస్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో క్లారిటీ లేదు గాని.. సునీల్ కమెడియన్ గా యూటర్న్ తీసుకున్న అరవింద సమేత వీర రాఘవ, అలాగే అమర్ అక్బర్ ఆంటోని మాత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. కాకపోతే హీరోగా సునీల్ రెమ్యునరేషన్ మూడొంతులు పడిపోయిందనే న్యూస్ ఇప్పుడు ఒక రేంజ్ లో సోషల్ మీడియాతో సహా.. ఫిలిం సర్కిల్స్ లోను చక్కర్లు కొడుతోంది. సునీల్ హీరోగా ఫామ్ లో ఉన్నప్పుడు దాదాపుగా 4 కోట్లు అందుకునేవాడట. కానీ ఇప్పుడు భీమినేని సినిమా కోసం కోటిన్నర మాత్రమే అందుకుంటున్నాడట. ఇక కమెడియన్ గా సునీల్ పారితోషకం పర్వాలేదనిపించేలా అనిపిస్తుంది.

కామెడియన్ మంచి పాత్రలే…

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేతలో సునీల్ కి మంచి క్యారెక్టర్ ఇచ్చాడట త్రివిక్రమ్. మరి సునీల్ త్రివిక్రమ్ ఫ్రెండ్స్ ఆయే. ఇక శ్రీను వైట్ల కూడా సునీల్ కోసమే అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడనే టాక్ ఉంది. మరి ఈ రెండు ప్రాజెక్టులు పెద్దవే కావడంతో ఈ రెండు సినిమాలకు సునీల్ ఒక్కో సినిమాకి కోటి రూపాయల పారితోషకం అందుకుంటున్నాడనే టాక్ వినబడుతుంది. మరి హీరోగా 4 కోట్లు అందుకున్న సునీల్ ఒక్కసారిగా హీరోగానే కోటిన్నరకు పడిపోయాడంటే.. ఇక సునీల్ కి హీరో అవకాశాలు రానట్లే లెక్క.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*