ఎన్టీఆర్ గురువుగా సునీల్..?

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత వీరరాఘవ’ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు మరికొంత మంది నటీనటులపై చిత్రీకరిస్తున్నారు త్రివిక్రమ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది. అది కూడా కమెడియన్ సునీల్ పైన.

అప్పుడు బ్రహ్మానందం… ఇప్పుడు సునీల్…

ఈ చిత్రంతో కమెడియన్ గా సునీల్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సునీల్ పాత్ర స్టార్ట్ టు ఎండ్ వరకు వుంటుందట. సినిమా మొత్తంగా సునీల్ ఎన్టీఆర్ తోనే ఉంటాడంట. అయితే ‘అదుర్స్’ లో ఎన్టీఆర్.. బ్రహ్మానందంని గురువు గారు.. గురువు గారు అని పిలిచినట్టు ఇందులో ఎన్టీఆర్ సునీల్ ని గురువుగారు.. గురువుగారు అని పిలుస్తాడట.

90 శాతం సీన్లలో…

ఇందులో సునీల్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా ఉంటుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ తన స్నేహితుడు సునీల్ కోసం ఎలాంటి పాత్ర తయారుచేసాడు అంటే సినిమాలో ఆల్ మోస్ట్ సునీల్ 90శాతం సీన్లలో కనిపిస్తాడట. అంతే కాదు ఓ సాంగ్ లో కూడా కనిపిస్తాడట. మరి త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగ్స్ సునీల్ ఎలా పండిస్తాడో చూడాలి. సునీల్ కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వస్తున్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్’ ఈ శుక్రవారం రిలీజ్ అవ్వబోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*