శ్వేతా బసు ఇలా తయారైందేంటి..?

‘కొత్త బంగారు లోకం’ మూవీతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన శ్వేతా బసు ప్రసాద్.. తర్వాత తెలుగు, తమిళ్ లో కొన్ని సినిమాల్లో కనిపించింది. కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ వదిలి ముంబైకి వెళ్లి అక్కడ బాగానే సెటిల్ అయింది ఈ బ్యూటీ. ఆ మధ్య బాలీవుడ్ లో ‘బద్రీనాథ్ కి దుల్హనియా’ అంటూ కనిపించిన శ్వేతాబసు.. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ వచ్చింది.

వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం…

ఈసారి ప్రొఫెషనల్ గానే హైదరాబాద్ కి వచ్చింది ఈ భామ. అమెజాన్ ప్రైమ్ వారు నిర్మిస్తున్న ‘గ్యాంగ్ స్టార్స్’ అనే వెబ్ సిరీస్ జూన్ 1 నుంచి ప్రసారం కానుంది. మొత్తం 10 ఎపిసోడ్స్ సిరీస్ గా వస్తున్న గ్యాంగ్ స్టార్స్ లో ఔత్సాహిక నిర్మాతగా శ్వేతా బసు కనిపించబోతోంది. ఈ సిరీస్ కు సంబంధించి ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది శ్వేతా బసు.

కొత్త లుక్ లో…

అయితే ఈసారి మరింత అందంగా సరికొత్త లుక్ తో ఎంట్రీ ఇచ్చింది. గతంలో కాసింత బొద్దుగా కనిపించిన ఈ భామ.. ఇప్పుడు బాగానే చిక్కింది. కొద్దిగా గ్లామర్ ను చూపిస్తూ.. స్లీవ్ లెస్ డ్రెస్సులో గ్యాంగ్ స్టర్స్ కి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది శ్వేత బసు ప్రసాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*