సై రా కోసం మరొకటి సిద్ధం చేశారు..!

చిరంజీవి హీరోగా రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సై రా నరసింహారెడ్డి సినిమా ఈ మధ్యన వివాదాల్లో చిక్కుకుంది. అసలే భారీ ప్రాజెక్ట్ కావడంతో… ఈ సినిమాపై ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ఉంది… అలాగే ఈ వివాదాలతో సై రా సినిమాపై మీడియాలో వస్తున్న వార్తలతో మరింత పబ్లిసిటీ అయ్యింది. అయితే ఈ సినిమా విషయంలో వేసిన ఒక సెట్ తాజాగా వివాదాస్పదమైంది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన శేరిలింగంపల్లిలో సై రా నరసింహారెడ్డి ఇంటి సెట్ కోసం అనుమతులు తీసుకోనందున రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. మరి ఆ ప్రాంతంలోనే గతంలో రామ్ చరణ్ – సుకుమార్ ల రంగస్థలం సినిమా సెట్ వేసి దాదాపుగా ఏడాది పాటు షూటింగ్ చేశారు.

మరో ప్రాంతంలో సెట్

ఇక అదే స్థలంలో అంటే ఆ 20 ఎకరాల స్థలంలో రామ్ చరణ్ మెగా స్టూడియో నిర్మాణం చేప్పట్టబోతున్నాడంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చిన విషయం కూడా బాగానే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సై రా సెట్ కూల్చేయడంతో సై రా సినిమా షూటింగ్ వాయిదా పడింది. మరి ఇప్పుడిప్పుడే మెల్లిగా షూటింగ్ పికప్ అవుతున్న ఈ టైం లో సై రా సినిమా షూటింగ్ వాయిదా పడితే నిర్మాతలు భారీగా నష్టపోవడమే కాదు.. సినిమాపై క్రేజ్ తగ్గుతుందని భావించిన మేకర్స్ సై రా కోసం మరో ప్రాంతంలో సెట్ వేసిన యూనిట్ మంగళవారం నుంచి షూటింగ్ ని యధాతధంగా ప్రారంభించింది.

చిరు పుట్టినరోజున ఫస్ట్ లుక్

అయితే ఈ కోట సెట్లోనే సుమారు నెల రోజుల పాటు ఏకదాటిగా షూటింగ్ జరుపుతారని.. అలాగే అక్కడ వేసిన ఆ సెట్ లోనే బ్రిటిషర్లతో సై రా నరసింహారెడ్డి జరిపే పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. మరి ఇలా సినిమా షూటింగ్ ని శరవేగంగా చిత్రీకరిస్తూనే ఈ నెల 22 కల్లా సై రా ఫస్ట్ లుక్ ని వదిలే ప్రయత్నాలు దర్శకుడు సురేందర్ రెడ్డి చేస్తున్నాడు. చిరు బర్త్ డే రోజున సై రా లుక్ గ్యారెంటీ అనే టాక్ ఉంది. నయనతార, అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*