అరవింద్ కాదు.. ఈసారి మమ్ముట్టి?

తమిళ హీరో జయం రవి అన్నయ్య మోహన్ రాజా డైరెక్షన్ వచ్చిన ’తని ఒరువన్’ సినిమాలో జయం రవి, నయనతార జంటగా నటించారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ హీరో అరవింద స్వామి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు రావడమే కాదు అతని పాత్ర సినిమాకే హైలైట్ అయింది. చాలా కాలం తర్వాత ఆయన తమిళ ఇండస్ట్రీలోకి ఈచిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.

తెలుగులో ధృవగా…..

ఈ సినిమాను తెలుగులో ‘ధృవ’ అనే టైటిల్ తో రామ్ చరణ్ హీరోగా సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా అరవింద స్వామియే ప్రతినాయకుడు. ఇక్కడ కూడా ఈ చిత్రం విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ తమిళంలో సేమ్ కాంబినేషన్ లో అంటే జయం రవి , మోహన్ రాజా కాంబినేషన్ లో ‘తని ఒరువన్ 2’ తెరకెక్కనుంది. ఇందులో ఈసారి నయన్ కి బదులు కాజల్ అండ్ సాయేషా కథానాయికలుగా నటించనున్నారు.

విలన్ పాత్రలో….

మొదటి పార్ట్ లా ఈ పార్ట్ లో కూడా విలన్ పాత్ర సినిమాకి హైలైట్ కానుందట. అయితే ఈసారి ఆ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నారట. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి వుంది. మమ్ముట్టి ప్రస్తుతం తెలుగులో ‘యాత్ర’ అనే చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నారు. పార్ట్ 2 లో అరవింద స్వామి కి బదులు మమ్ముట్టి ని ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారో తెలియాల్సిఉంది. మరి ఈ చిత్రంని కూడా తెలుగులో రీమేక్ చేస్తారా? అన్న విషయంపై కూడా క్లారిటీ రావాలి.