ఈసారి కన్ఫ్యూజన్ లో పడేసేటట్లున్నాడే.

ప్రియ‌ద‌ర్శి

‘పెళ్లి చూపులు’ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్.. ఆ సినిమా తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లో ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా ని డైరెక్ట్ చేస్తున్నాడు. ‘పెళ్లి చూపులు’ సినిమా ‘లో’ బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మెప్పించిన తరుణ్ భాస్కర్ ఈసారి మాత్రం కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. థియేటర్ లో సినిమా మొదలయే ముందు… ‘ఈ నగరానికి ఏమైంది.. ఒక పక్క దుమ్ము, పొగ…’ అంటూ వచ్చే ఆరోగ్యపరమైన యాడ్ ని టైటిల్ గా తీసుకుని తరుణ్ కొత్త నటీనటులతో కొత్తగా ట్రై చేస్తున్నాడు. విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

‘పెళ్లి చూపులు’ సినిమాని.. డీసెంట్ డైలాగ్స్ తో… మన జీవితంలో జరిగిందా అనే మాదిరిగా అందరికి అర్ధమయ్యేలా రెడీ చేసుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి మాత్రం చాలా డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో ‘ఈ నగరానికి ఏమైంది ‘అంటూ ఫిల్మ్ మేకింగ్ కోసం నలుగురు యువకులు పడే తపనని తెర మీద చూపించబోతున్నాడు. మరి తరుణ్ భాస్కర్ యూత్ ని టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమా ట్రైలర్ లో ఎక్కడా.. కథ రివీల్ కాకుండా కన్ఫ్యూజన్ లో పెట్టేసాడు. నలుగురు యువకులు తమ జీవితంలో సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ.. వాళ్ళు పడేకష్టాలను తన గర్ల్ ఫ్రెండ్ తో పంచుకుంటుంటారు. మరి అందరూ కొత్త నటులే కావడంతో… ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

కానీ కొత్త కాన్సెప్ట్ కి కొత్త నటులైతే బావుంటుందని తరుణ్ భాస్కర్ అనుకున్నాడేమో.. అందుకే సినిమా లో కొత్తమొహాలను దింపేసాడు. ఇక ‘పెళ్లి చూపులు’ అప్పుడు సినిమ విడుదలకు పడ్డ కష్టాలు తరుణ్ కి ఇప్పుడు లేవు. అందుకే ‘పెళ్లి చూపులు’ విడుదలకు ముందు లేని క్రేజ్ ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది’ మీద ఎక్కువ ఉంది. కారణం ‘పెళ్లి చూపులు’ హిట్ కావడం ఒక ఎత్తు అయితే… సురేష్ ప్రొడక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*