తేజ వాటికి ఒప్పుకునే రకం కాదు.. మరి ఎలా?

డైరెక్టర్ తేజ తన సినిమాలను డైరెక్ట్ చేయడంలో ప్రత్యేక తీరు చూపిస్తూ ఉంటాడు. అన్ని సినిమాల్లో లాగా హీరోయిజమ్ ను ఎలేవేట్ చేయడం.. డ్యూయెట్లు వేయించటం.. ఐటెం సాంగ్స్ పెట్టడం..హీరోకి ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టడం ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్లడు తేజ. సినిమా రెజల్ట్ తో సంబంధం లేకుండా కథనే నమ్ముకుని వెళ్లడం తేజ స్టైల్.

కలిసొచ్చిన హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసినా అతని తీరు మార్చుకొలేదు తేజ. అలాంటి తేజ ఇప్పుడు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో సినిమా అని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది అయితే దాన్ని నిజం చేస్తూ నిన్న ఉదయం పూజా కార్యక్రమంతో ఈ సినిమాను స్టార్ట్ చేశారు. బెల్లంకొండ సరసన తేజకి బాగా కలిసొచ్చిన హీరోయిన్ కాజల్ నటిస్తుంది.

తేజ స్టైల్ మార్చుకునేనా…

శ్రీనివాస్ మొదటి సినిమా నుండి తన సినిమాలో ఏదో ఒక కమర్షియల్ హంగులు ఉండేటట్టు చూసుకున్నాడు. అతనితో పని చేసిన డైరెక్టర్స్ కూడా శ్రీనివాస్ ని ఓ మాస్ హీరోగా చూపించారు. అయితే తేజ ఇలాంటి వాటికి ఒప్పుకునే రకం కాదు. అతనికంటూ ఒక స్టైల్ ఉంది. ఎంత పెద్ద హీరో అయినా తేజ మాట వినాల్సిందే. అందుకే తేజ పెద్ద స్టార్స్ తో సినిమా చేయడానికి ఇష్టపడరు. మరి శ్రీనివాస్‌ను ఎలా చూపిస్తాడో.. వీళ్లిద్దరికి ఎలా సెట్టవుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*