మళ్ళీ తేజస్విని తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయా?

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బుల్లితెర మీద బిగ్ బాస్ సీజన్ 2 హడావిడి మాములుగా లేదు. బిగ్ బాస్ హౌస్ లో జరిగే రచ్చ తో పాటుగా అందులోని ఎంటర్టైన్మెంట్ కి ప్రేక్షకులు మెల్లగా అలవాటు పడుతున్నారు. ఐదు వారాలుగా ఈ బిగ్ బాస్ లో ఏదైనా జరగొచ్చని బిగ్ బాస్ హోస్ట్ నాని చెప్పినట్లుగానే అసలేం జరుగుతుందో అనేది అర్ధం కాకుండా పోతుంది. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్నవాళ్ళు అలాగే ఫైనల్ గా వీళ్ళు ఉంటారనుకుని ఫిక్స్ అవుతున్న వారిలో మెల్లిగా ఒక్కొక్కరుగా షో నుండి ఎలిమినేట్ అవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. యాంకర్ శ్యామల గాని, భాను గని, తేజస్వి గాని బిగ్ బాస్ నుండి బయటికెళ్తారు అనుకోలేదు. ఎందుకంటే బాబు గోగినేని, గణేష్ లాంటి వాళ్ళు ఈ షోకి వెస్ట్ అనిపించేలా ఉన్నారు. కానీ వారు సేఫ్ జోన్ లో ఉండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లడం అనేది మాత్రం అర్ధం కానీ విషయం. ఇక హౌస్ లో పెద్దగా నోరేసుకుని అందరి మీద పడే తేజస్విని బిగ్ బాస్ టీమ్ బయటికి వెళ్లకుండా కాపాడుతుందని.. నాని కూడా తేజస్విని తిట్టడమే కానీ బయటికి పంపే యోచన చెయ్యడం లేదని.. అసలు ఫైనల్ కంటెస్టెంట్స్ లో తేజస్వి ఉండేలా బిగ్ బాస్ టీమ్ ముందే నిర్ణయించుకుందని.. ఇలా అనేక రకాలుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.

ఇక తేజస్వి ని ఫైనల్ గా బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఎట్టకేలకు గత ఆదివారం బయటికి పంపేశారు. మరి అలా పంపిన 24 గంటల్లోనే మళ్ళీ బిగ్ బాస్ హౌస్ నుండి మీరు ఎలిమినేట్ చేసిన కంటెస్టెంట్స్ లో ఒకరిని తిరిగి హౌస్ లోకి పంపొచ్చనే ట్విస్ట్ ని స్టార్ మా ప్రేక్షకులకు ఇచ్చింది. హోస్ట్ చేస్తున్న నాని తో ఈ ప్రోమోని కట్ చేసింది స్టార్ మా. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన వారిలో ఎవ‌రికైతే ఎక్కువ ఓట్లు ల‌భిస్తాయో వారిని మ‌ళ్లీ మ‌రోసారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపొచ్చు. మరి అలా ఫస్ట్ సీజన్ లో అయితే లేదు. కానీ సెకండ్ సీజన్ కి వచ్చేసరికి ఇలా చేస్తున్నారు… ఎందుకంటే.. ఎప్పుడూ హుషారుగా… స్పైసి గా… హాట్ హాట్ గా కాంట్రవర్సీలకు కేరాఫ్ అయినా తేజస్వి మడివాడను మల్లీ షోలోకి తెచ్చే ఏర్పాట్లు మొదలైందనే టాక్ వినబడుతుంది.

మరి ఈ షో నుండి బయటికెళ్లిన సంజన, నూతన నాయుడులకు మళ్ళీ షో ఎంట్రీ ఇక లేనట్లే. ఎందుకంటే షో నుండి బయటికొచ్చాక వారి బిగ్ బాస్ హౌస్ గురించి నాని గురించి రకరకాల హాట్ కామెంట్స్ చెయ్యడం. అలాగే కిరీటి విషయం. కౌశల్ విషయంలో కిరీటి బ్యాడ్ అయ్యాడు. ఇక మిగిలిన శ్యామల, భాను, తేజస్విలలో మెయిన్ గా తేజస్విని హౌస్ లోకి మళ్ళీ వెళ్తుందని టాక్ అపుడే సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. నిజంగా తేజస్వి గనక బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిందా… అది కావాలనే స్టార్ మా ప్లే చేసిన ట్రిక్ అంటూ ప్రేక్షకుల్లో కొందరు సోషల్ మీడియా సాక్షిగా ఎగబడడం ఖాయం. ఇక పెద్ద ట్విస్ట్ ఏమిటంటే.. ఈ వారం ఎలిమినేషన్స్ కోసం తీసుకున్న నామినేషన్ సభ్యులకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ వారం ఎలిమినేషన్స్ ని రద్దు చేసింది బిగ్ బాస్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*